AP Real Estate Company Tenders Telangana Wineshops
Real Estate Company: తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ షాపుల లాటరీ ప్రక్రియి ఇటీవల ముగిసింది. టెండర్ల ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వచ్చింది. మెజార్టీ సిండికేట్ కాగా.. కొందరు టెండర్ వేసి దక్కించుకున్నారు. అలా ఏపీకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ (Real Estate Company ) కూడా టెండర్.. కాదు కాదు టెండర్లు వేసింది. అవును 5 వేల టెండర్లు వేసింది. ఇందుకోసం సదరు కంపెనీ రూ.100 కోట్లు ఖర్చు చేసింది.
పెట్టిన ఖర్చుకు ఫలితం కాస్త దక్కింది. అవును 5 వేల షాపుల్లో టెండర్ వేయగా.. 110కు పైగా షాపుల టెండర్ దక్కింది. అంటే ఒక్కో షాపు.. ఏరియాను బట్టి రన్ చేస్తే అంతకుమించి లాభాలు వస్తాయి. లేదు వద్దు అనుకుంటే ఇతరులకు కూడా అమ్మేయచ్చు. అలా పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చే అవకాశం ఉంటుంది.
110 షాపులు
110 షాపుల్లో 30 షాపులను తీసుకుంటే.. ఒక్కో షాపును రూ.40 లక్షలకు విక్రయించినా రూ.12 కోట్లు వస్తాయి. 40 షాపుల విషయానికి వస్తే.. ఒక్కో షాపు రూ.60 లక్షలకు అమ్మినా రూ.24 కోట్లు వస్తాయి. మరో 40 షాపుల్లో.. ఒక్కో షాపును రూ.1.20 కోటికి విక్రయించినా రూ.48 కోట్లు వస్తాయి. అంటే కనీసం రూ.84 కోట్ల వరకు వస్తాయి. ఒక్కో ఏరియాలో షాపు రూ.5 కోట్ల వరకు కూడా వెళ్లొచ్చు. సో.. అలా అయితే పెట్టిన పెట్టబడితోపాటు రూ.10 నుంచి రూ.20 కోట్ల లాభం పొందొచ్చు.
మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు 100 కోట్లు ఖర్చు చేసిన రియల్ ఎస్టేట్ కంపెనీ
ఏపీకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ తెలంగాణలో మద్యం దుకాణాల కోసం 5,000 దరఖాస్తులు వేసి ఏకంగా 100 కోట్లు ఖర్చు చేసి లక్కీ డ్రాలో 110 పైగా మద్యం దుకాణాలు దక్కించుకుంది. pic.twitter.com/jmisfrLHpy
ఏపీకి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ (Real Estate Company ) ఈ స్థాయిలో టెండర్లు ఎందుకు వేసిందో అర్థం కావడం లేదు. తెలంగాణలో లిక్కర్ టెండర్ కోసం రూ.2 లక్షలు కట్టాల్సి ఉంటుంది. అవీ నాన్ రీఫండబుల్.. అంటే తిరిగి ఇవ్వరు. ఆ కంపెనీ రూ.100 కోట్లను ఖర్చు చేసింది. 5 వేల షాపులకు వేస్తే.. వందల్లో మాత్రమే వచ్చాయి. అదే వెయ్యికి పైగా షాపులు వస్తే పరిస్థితి మరోలా ఉండేది. అలా అయితే ఒక్కో షాపుకు కనీసం రూ.30 లక్షలకు విక్రయించినా సరే రూ.300 కోట్లు వచ్చేవి. తమకు లక్ ఉందని.. ఎక్కువ షాపులు వస్తాయని టెండర్లు వేసి ఉంటుంది. కానీ అదీ వర్కవుట్ కాలేదు.
తిరిగి అమ్మేయడమే
ఆ కంపెనీకి తక్కువ మొత్తంలో షాపులు దక్కాయి. సో.. అన్నీ షాపులను మెయింటెన్ చేయడం కష్టమే అయినందున.. వాటిలో కొన్నింటినీ అయినా విక్రయించే అవకాశం ఉంది. దేశంలో.. ఎవరైనా సరే.. ఎక్కడైనా వ్యాపారం చేసే వీలు ఉంటుంది. అందుకోసమే.. ఆ రియల్ సంస్థ.. ఒక్కసారి భారీ లాభాలపై ఫోకస్ చేసింది. అనుకున్న షాపులను దక్కించుకోలేదని ఆ కంపెనీ సన్నిహిత వర్గాలు అంటున్నాయి.