»Uk News Anchor Says India Shouldnt Ask For Foreign Aid After Chandrayaan3 Indians Replied Strongly
UK న్యూస్ యాంకర్ నోటి దూల.. ఇకపై ఇండియా నిధులు అడగొద్దని అక్కసు
బ్రిటిష్ మీడియా యాంకర్ పాట్రిక్ క్రిస్టీస్ భారత్‌పై విషం కక్కాడు. చంద్రయాన్3 ప్రయోగం సక్సెస్ కావడంతో.. ఆ దేశానికి నిధులు ఇవ్వడం ఎందుకని అక్కసు వెళ్లగక్కాడు.
UK News Anchor Says India Shouldn't Ask For Foreign Aid After Chandrayaan3. Indians Replied Strongly
UK News Anchor: చంద్రయాన్3 సక్సెస్ కావడంతో యావత్ ప్రపంచం భారత దేశాన్ని అభినందిస్తోంది. ఇస్రో, శాస్త్రవేత్తలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం విషం కక్కుతున్నారు. వారిలో బ్రిటన్ న్యూస్ యాంకర్ పాట్రిక్ క్రిస్టీస్ చేరిపోయాడు. ఇండియాకు కంగ్రాట్స్ చెబుతూనే.. ఇకపై ఆ దేశానికి గ్రాంట్స్ ఇవ్వొద్దని అక్కసును వెళ్లగక్కాడు. అతని కామెంట్లను బ్రిటన్ నెటిజన్లు కూడా వ్యతిరేకించారు. ఇక ఇండియన్స్ అయితే దుమ్ముదులిపేశారు.
విషం కక్కిన పాట్రిక్ క్రిస్టీస్
యూకేకు చెందిన జీబీ న్యూస్‌లో పాట్రిక్ క్రిస్టీస్ (Patrick Christys) న్యూస్ యాంకర్‌గా పనిచేస్తున్నాడు. చంద్రయాన్ 3 తర్వాత తనలో ఉన్న విషాన్ని ఒక్కసారిగా కక్కేశాడు. ఇకపై భారత్ ఇతర దేశాలను ఆర్థిక సాయం కోరద్దని అభిప్రాయపడ్డారు. ఇంతకుముందు బ్రిటన్ ఇచ్చిన 2.3 బిలియన్ పౌండ్లను వెనక్కి ఇవ్వాలని సూచించారు. 2016 నుంచి 2021 వరకు ఆ ఫండ్స్ ఇండియాకు బ్రిటన్ అందజేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఇచ్చే 57 మిలియన్ పౌండ్ల విదేశీ సాయన్ని కూడా నిలిపివేయాలని సూచించారు. భారత్‌కు సాయం చేసే దేశం, అధినేతల మెదళ్లలో నెగిటివ్ ఇంప్రెషన్ కలిగించాడు.
రాకెట్లను పంపుతూ..
ఒక దేశం సొంతంగా రాకెట్లను తయారు చేసుకొని.. అంతరిక్షంలోకి పంపుతుంది. అలా అయితే ఆ దేశం అభివృద్ధి చెందినట్టే.. మరీ ఇతర దేశాలను సాయం అర్థించడంలో అర్థం కాలేదని పాట్రిక్ అక్కసును వెళ్లగక్కాడు. భారతదేశంలో 29 మిలియన్ ప్రజలు పేదరికంలో ఉన్నారని ఐక్యరాజ్య సమితి నివేదిక తెలియజేస్తోంది. కానీ ఇదీ అవాస్తవం.. ప్రపంచంలో భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. భారత జీడీపీ 3.75 ట్రిలియన్ డాలర్లు అని వివరించారు. పేదరికం గురించి సొంత ప్రభుత్వం ఇబ్బంది పడనప్పుడు మనకు ఎందుకు అని అడిగారు. భారత్ కాదు.. చైనాకు కూడా బ్రిటన్ విదేశీ సాయం అందజేస్తోందని గుర్తుచేశాడు. సిరియా, ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్ లాంటి దేశాలకు సాయం చేస్తే సరిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
బ్రిటిష్ నెటిజన్ల రియాక్షన్
పాట్రిక్ (Patrick Christys) కామెంట్లపై బ్రిటిష్ నెటిజన్లు కూడా స్పందించారు. భారతదేశానికి సాయం చేశారని అంటున్నారు.. మరీ ఇక్కడ ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదని ఒకరు కామెంట్ చేశారు. నిజమే అని ఒకరు రాశారు. బ్రిటన్ పేద దేశాలకు సాయం చేస్తుంటే.. ఆ దేశాలు స్పేస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాయని.. చంద్రమండలంపై అడుగుపెడుతున్నాయని వివరించారు. అంతే తప్పు మనది కూడా ఉందని ఇండెరైక్టుగా చెప్పేశారు. బ్రిటిష్ నెటిజన్లు అలా ఉండగా.. ఇండియన్ నెటిజన్స్ ఏకీపారేశారు.
ఏకీపారేసిన ఇండియన్స్
దాదాపు 200 ఏళ్లు ఇండియాను పాలించి 44 ట్రిలియన్ డాలర్లను దోచుకున్నారు.. ఆ డబ్బులు ఇవ్వండని అడిగారు. మరొకరు 44 ట్రిలియన్ డాలర్లతోపాటు కోహినూర్ వజ్రం కూడా తిరిగి ఇచ్చేయాలని రాశారు. విదేశీ సాయం ఇవ్వమని అడిగినందుకు థాంక్స్.. అదే రూల్ మీకు వర్తింపజేస్తోంది. తమ దేశానికి సెల్యూట్ చేసి 45 ట్రిలియన్ డాలర్లను ఇచ్చేయాలని కోరారు. పాట్రిక్ చేసిన కామెంట్స్‌పై ఇండియన్ నెటిజన్స్ అంతే ధీటుగా స్పందించారు. తమ దేశ వనరులు దోచుకుని.. ఇప్పుడు బ్రిటన్ ఈ స్థాయిలో ఉందని.. తీసుకున్న వాటికే ఆ దేశం తిరిగి అందచేస్తోందని మరొకరు అన్నారు.
విమర్శలు
పాట్రిక్ క్రిస్టీస్ (Patrick Christys) చేసిన కామెంట్లు దుమారం రేపాయి. సొంత దేశంలో కూడా అతని తీరును విమర్శిస్తున్నారు. ఇంత డెవలప్ అయిన దేశం.. ఎందుకు అంతరిక్షంలో సక్సెస్ కాలేకపోతుందని అడిగారు. అందుకు కారణం ఎవరు..? అని నిలదీశారు. ఇక ఇండియన్ నెటిజన్లు అయితే చీల్చి చెండడారు.