మిల్కీ బ్యూటీ తమన్నా పోలీస్ అధికారి పాత్రలో నటించిన రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన తాజా వెబ్ సిరీస్ ఆఖ్రీ సచ్. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.
సిరీస్: ఆఖ్రీ సచ్ నటీనటులు : తమన్నా భాటియా, అభిషేక్ బెనర్జీ, శివిన్ నారంగ్, నిఖిల్ నందా, కృతి విజ్ తదితరులు దర్శకత్వం : రాబీ గ్రేవాల్ నిర్మాతలు : నిఖిల్ నందా, ప్రీతి, నీతి రచన : సౌరవ్, రీతూ శ్రీ సినిమాటోగ్రఫి : వివేక్ షా, జై భన్సాలీ సంగీతం : అనూజ్ దనైత్, శివమ్ సేన్ గుప్తా విడుదల తేదీ: ఆగస్టు 25, 2023 ఓటీటీ : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
బ్యూటి ఫుల్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia) పోలీస్ అధికారిగా ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ఆఖ్రీ సచ్(Aakhri Sach Web Series). 2018లో ఢిల్లీలో జరిగిన బురారీ ఫ్యామిలీ ఆత్మహత్యల నేపథ్యంలో నిజమైన సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (disney plus hotstar) ఓటీటీలో ఆగస్టు 25 నుంచి మొదటి రెండు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరీ ఇవి ఎలా ఉన్నాయో సమీక్షిద్దాం.
కథ:
ఢిల్లీలోని కిషన్ నగర్ ప్రాంతంలో ఓ కుటుంబంలో ఉన్న 11 మంది ఆత్మహత్య చేసుకుంటారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిజ జీవిత కేసును అన్యా (తమన్నా భాటియా) దర్యాప్తు చేబడుతుంది. మొత్తం ఫ్యామిలీలోని 11 మందిలో ముసలావిడ ఊపిరి పోవడానికి ముందు బతకడానికి పోరాటం చేసినట్లు కొన్ని అనవాళ్లు కనిపిస్తాయి. మిగతా సభ్యులు కళ్ళకు గంతలు చేతికి కట్లు కట్టుకుని ఉరి వేసుకుని ఉంటారు. అయితే వారు ఉరి వేసుకున్న స్పాట్‌కు కుర్చీలు కొంచెం దూరంగా ఉండటంతో అన్యాకు వారి సూసైడ్‌పై అనుమానం వస్తుంది. కేసు దర్యాప్తును వేగవంతం చేస్తుంది. అయితే తన ఇన్విస్టిగేషన్లో ఏం తెలుసుకుంది అనేది కథ.
ఎలా ఉంది:
బురారీ కుటుంబంలో 11 మంది మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై అప్పట్లో చాలా కథనాలు వినిపించాయి. దీనిపై నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో డాక్యుమెంటరీ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇక నేరుగా కథలోకి తీసుకెళ్లి ఫ్యామిలీలో పదకొండు మంది మరణం చూపించారు. ఇక తమన్నా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. దీనిపై టీవీ డిబేట్స్, న్యాయం కోసం ప్రజల పోరాటం చూసినట్టు ఉంటుంది. అయితే కథలో పెద్దగా ట్విస్టులు ఉండవు. ఆద్యాంతం ఆసక్తిగా సాగుతుంది. మొదటి రెండు ఎపిసోడులు స్ట్రీమింగ్ అవుతున్నాయి. కాబట్టి ఇంకా పూర్తిగా చెప్పలేము. టెక్నికల్ అంశాల పరంగా సిరీస్ ఉన్నత స్థాయిలో ఉంది. మ్యూజిక్, కెమెరా వర్క్, ప్రొడక్షన్ డిజైన్ బావున్నాయి.
ఎవరెలా చేశారు:
తమన్నా గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు. ఇంటెన్స్ క్యారెక్టర్‌ను కూడా అద్భుతంగా చేస్తారని ఈ సిరీస్‌తో నిరుపించారు. తన నటనతో మెప్పించింది. ఈ రెండు ఎపిసోడ్లలో అభిషేక్ బెనర్జీ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ అద్భుతంగా చేశారు. శివిన్ నారంగ్ నటన, ఆయన పాత్ర ప్రయాణం తర్వాత ఎపిసోడ్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.