టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కాగా… ప్రమాదం నుంచి ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారు. ముంబయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన…. ప్రమాదం జరిగిన దాదాపు 18 రోజుల తర్వాత… తొలిసారి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
తన సర్జరీ విజయవంతమైందని, కోలుకుంటున్నానని ఇకపై వచ్చే ప్రతి సవాలును దైర్యంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని, మీ అందరి మద్దతు, విషెస్ చూసి చాలా సంతోషిస్తున్నా. నాకు ఇంత ప్రేమ పంచినందుకు ధన్యవాదాలు అని అన్నాడు.
కొత్త సంవత్సరానికి ముందు రూర్కీ సమీపంలో పంత్ వెళ్తున్న కారుకు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్కు స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స చేసిన తర్వాత శస్త్రచికిత్స అవసరం ఉండటంతో అతన్ని ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడే అతనికి పలు ఆపరేషన్లు జరిగాయి. ముఖ్యంగా అతని మోకాళ్లకు శస్త్రచికిత్స చేసినట్లు డాక్టర్లు తెలిపారు. ఇక 2023 ఐపీఎల్ లో పంత్ జట్టులో లేడని సౌరవ్ గంగూలీ ధృవీకరించాడు. అలాగే వచ్చే నెలలో ఆస్ట్రేలియాపై జరిగే గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ కి సంబంధించి భారత జట్టులో కూడా పంత్ లేడన్నారు.