ప్రముఖ నటి రాఖీ సావంత్ (Rakhi Sawant) షాకింగ్ కామెంట్స్ చేసింది. తన మాజీ భర్త ఆదిల్ ఖాన్ తన న్యూడ్ వీడియోలను రూ.47 లక్షలకు అమ్ముకున్నాడని ఆరోపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన నగ్న వీడియోల(Nude videos)ను అదిల్ దుబాయ్‌లో అమ్ముకున్నాడని తెలిపింది. ‘నేను బాత్రూమ్ (Bathroom)లో ఉండగా అతడు నన్ను వీడియో తీశాడు. అలాంటివి చాలా వీడియోలు తీశాడు. వీడియోలు తీసేటప్పుడు నా ఒంటిమీద నూలుపోగు కూడా లేదు. వీడియోలు (Videos) తీసినా నేను ఏమీ అనలేదు. అప్పుడు నేను అతడి భార్యని, ఆ సమయంలో నన్ను అతడు రేప్ కూడా చేశాడు’ అని పింక్విల్లా(Pinkvilla)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాఖీ సావంత్ పేర్కొంది.
అప్పుడు తీసిన వీడియోలను దుబాయ్‌లో రూ.47 లక్షలకు అదిల్ ఖాన్ (Adil Khan) అమ్మేశాడని రాఖీ ఆరోపించింది. ‘వీడియోలు వైరల్ అయితే నేను ఏం చేయాలి? విషం తాగి ఆత్మహత్య (Suicide) చేసుకోవాలి. ఇంకేం చేయాలి? ప్రపంచం మొత్తం నా నగ్న వీడియోలు చూసిన తరవాత నేను ఎక్కడికి పోవాలి? ఏ సమాజంలో జీవించాలి? నా మొహాన్ని ప్రపంచానికి ఎలా చూపించాలి? నేనొక సాధారణ అమ్మాయిని కాదు. ఇండియాలో నేనొక సెలబ్రిటీ(Celebrity)ని.నేను ఒక బ్రాండ్’ అని రాఖీ సావంత్ ఆవేదన వ్యక్తం చేసింది. రాఖీ – ఆదిల్ కొంతకాలం క్రితం సీక్రెట్‌గా వివాహం (Marriage) చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆదిల్ వేధిస్తున్నాడంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో రాఖీ పోలీసులను ఆశ్రయించారు. దీంతో దాదాపు ఆరు నెలల పాటు జైలు శిక్ష(Imprisonment) అనుభవించిన అతడు ఇటీవల బయటకు వచ్చాడు.