Jobs: గత ఏడాదితో పోలిస్తే ఈ సారి పరిస్థితులు మారాయి. ఏప్రిల్ – ఆగస్ట్ మధ్య ఉద్యోగ (Jobs) నియామకాలు గణనీయంగా పెరిగాయి. ఉద్యోగ నియామకాల కోసం ప్రకటనలే 23 శాతం పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదించింది. బీఎఫ్ఎస్ఐ, రిటైల్, టెలికాం సహా వివిధ రంగాల్లో 32 వేల ఉద్యోగ ప్రకటనలు వచ్చాయని తెలిపింది. పండగ సీజన్లో అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని నియమించిందని పేర్కొంది.
ప్రొడక్షన్ ట్రెనీ, బ్రాంచ్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్, కలెక్షన్ ఆఫీసర్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, బ్రాడ్‌బ్యాండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, వేర్ హౌస్ అసోసియేట్, కస్టమర్ రిలేషన్ షిప్ ఆఫీసర్ లాంటి ఉద్యోగాలకు ఫెస్టివల్ టైమ్‌లో ఎక్కువ అవసరం ఉంటుంది. నియామకాల అవసరం పెరగడం ప్రోత్సాహకరం.. ద్రవ్యోల్బణం, లాభదాయకత, ఒత్తిడి ఉన్నప్పటికీ.. తయారీ, బీఎఫ్ఎస్ఈ, రిటైల్ రంగాల్లో నియామకాల ప్రకటనలు గణనీయంగా పెరిగాయి.
భవిష్యత్‌లో మరిన్ని నియామకాలు జరగొచ్చని.. ఫెస్టివల్ టైమ్‌లో కనీసం 5 వేల నియామకాల ప్రకటనలు రావొచ్చని అంచనా వేశాయి. నోయిడా, పుణె, చెన్నై, ముంబై, బెంగళూర్, హైదరాబాద్ నుంచి ఎక్కువగా ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి.