ఉత్తరప్రదేశ్ (Uttarpradesh)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అమానవీయ ఉన్మాద ఘటన కలకలం రేపింది. ఐదేళ్ల చిన్నారిని ఓ సాధువు దారుణంగా హత్య చేశాడు. మధురలోని గోవర్ధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. జనాలంతా రద్దీగా ఉన్న రోడ్డులో ఐదేళ్ల చిన్నారిని సాధువు కిరాతకంగా హత్య చేశాడు. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి వద్దకు వెళ్లి పాప భుజాలపైకి ఎత్తుకుని నేలకేసి దుర్మార్గంగా బాదాడు. దీంతో ఆ పాప అక్కడికక్కడే చనిపోయింది. సన్యాని కోపానికి ఆ పాప బలైపోయింది.
చిన్నారి హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్:
https://twitter.com/i/status/1693225959674298491
ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (video Viral) అవుతోంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. ఐదేళ్ల చిన్నారి అంకిత్ ను హత్య చేయడంతో సన్యాసి వేషంలో ఉన్న వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చిన్నారి మృతితో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు, బంధువులు పోలీసులను డిమాండ్ చేశారు. ఈ కేసుపై మధుర దేహత్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ త్రిగుణ్ బిసెన్ మాట్లాడుతూ..ఠానా గోవర్దన్ ప్రాంతంలో హత్య జరిగినట్లు తెలిపారు. సన్యాసిని అక్కడున్న వ్యక్తులు తీవ్రంగా కొట్టారని, ప్రస్తుతం ఆ సన్యాసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా వెల్లడించారు. కేసు నమోదైందని, త్వరలోనే నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.