Balakrishna: ఏంటీ అరాచకం..ఈ సినిమాలు రీ రిలీజ్ ఏంది సామి!
ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్(re release) ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలకు సంబంధించిన సినిమాలను ఫ్యాన్స్ డిమాండ్ మేరకు 4K టెక్నాలజీలో విడుదల చేసి..ఊహించని లాభాలు చూస్తున్నారు నిర్మాతలు. అయితే కొందరు ఫ్లాప్ సినిమాలను కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. అది బాలయ్య నుంచి రెండు ఫ్లాప్ మూవీస్ రీ రిలీజ్ అనడమే..మరీ అరాచకంగా ఉంది.
ఇప్పటి వరకు సింహాద్రి, ఖుషి, జల్సా, పోకిరి, రెబల్, బిజినెస్ మేన్, ఆరెంజ్..లాంటి సినిమాలు రీ రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇక బాలయ్య(balakrishna) నటించిన చెన్న కేశవ రెడ్డి, నరసింహ నాయుడు, భైరవ ద్వీపం లాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఇవి హిట్ సినిమాలు కాబట్టి..రీ రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కెరీర్లో దారుణాతి దారుణమైన డిజాస్టర్ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు నిర్మాతలు. బాలకృష్ణ నటించిన ఒక్క మగాడు, లయన్ సినిమాలు రీ రిలీజ్‌కు రెడీ అవుతున్నట్టుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత నందమూరి ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టాయి.
అసలు ఈ సినిమాలను చూడడమంటే అదో పెద్ద సాహసమనే ఫీలింగ్‌లో బాలయ్య ఫ్యాన్స్(fans) ఉన్నారు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ థియేటర్లో ఎందుకు రిలీజ్ చేస్తున్నారో అర్ధం కావడం లేదని.. బాలయ్య ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బాలకృష్ణ నటించిన హిట్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఏరికోరి మరీ ఒక్క మగాడు, లయన్ సినిమాలనే ఎందుకు రీ రిలీజ్ చేస్తున్నారనేది అంతు బట్టని విషయమే. మిగతా స్టార్ హీరోల హిట్ సినిమాలు రీ రిలీజ్ అయి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటే.. బాలయ్య ఫ్లాప్ సినిమాలతో పరువు తీసుకునేలా చేస్తున్నారని కొందరు నందమూరి ఫ్యాన్స్ సదరు నిర్మాతలపై ఫైర్ అవుతున్నారు. అయితే అసలు ఈ సినిమాలు నిజంగానే రీ రిలీజ్ అవుతున్నాయా? లేదంటే ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందని చెక్ చేస్తున్నారా? అనేది తెలియకుండా ఉంది. ఏదేమైనా ఈ సినిమాలను రీ రిలీజ్ చేస్తే.. బాలయ్య ఫ్యాన్స్ తట్టుకునే పరిస్థితిలో లేరనే చెప్పాలి.