»Megastar Chiranjeevi Also Follow Kamal Haasan And Rajinikanth
Chiranjeevi: చిరు కూడా కమల్ రజినీని ఫాలో అవుతాడా?
ప్రతి ఒక్క హీరో ప్రతి సినిమాతో సక్సెస్ కాకపోవచ్చు. కొన్ని ప్లాపులు కూడా పలకరిస్తూ ఉంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం రజినీకాంత్, కమల్ హాసన్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. దీంతో వారు రిటైర్మెంట్ తీసుకోవడమే బెటర్ అని అభిమానులు అభిప్రాయపడ్డారు. అయితే లోకేశ్ కనగరాజ్‌తో కలిసి విక్రమ్‌తో కమల్ హాసన్ అద్భుతమైన హిట్ సాధించగా రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్‌తో కలిసి జైలర్‌తో హిట్ సాధించాడు.
megastar chiranjeevi also follow Kamal haasan and rajinikanth
పదే పదే పరాజయాలు ఎదురైనప్పటికీ అసలు కథలకే అతుక్కుపోయారు. ఇప్పుడు చిరంజీవి(Chiranjeevi) కూడా ఈ సీక్రెట్ ని ఫాలో అవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా విక్రమ్, జైలర్ సినిమాల గురించి తమిళ పంపిణీదారు, నిర్మాత శక్తి వేలన్ మాట్లాడుతూ “రెండు సినిమాలు రికార్డులను బద్దలు కొట్టాయి. సీనియర్ తారలు ఇప్పటికీ తమ లెక్కలోనే ఉన్నారని నిరూపించారు. వారికి ఎల్లప్పుడూ మాస్ ఫాలోయింగ్ ఉంది. కానీ వారికి సరైన స్క్రిప్ట్ అవసరం. ఆ స్క్రిప్ట్ వారికి దొరికింది. చివరకు విజయం దొరికిందని పేర్కొన్నారు.
కమల్ హాసన్ విక్రమ్‌లో ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటించగా, రజినీ జైలర్‌లో మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్ అతిధి పాత్రల్లో నటించారు. శక్తి వేలన్ మాట్లాడుతూ ‘రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ తమ తమ సినిమాలలో ఇతర భాషా నటీనటులకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చారనేది నిజం. కమల్ చిత్రం ‘విక్రమ్’ మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్, తమిళ స్టార్ విజయ్ సేతుపతిలకు సమానమైన స్పేస్ ఇచ్చారని ఆయన అన్నారు. ‘జైలర్’ కూడా మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ వంటి సూపర్ స్టార్ల కు స్కోప్ ఇచ్చారు. ఇప్పుడు చిరంజీవి సైతం తన సినిమాల్లో కథలను ఎంచుకునే విధానంలో మార్పులు చేసుకోవడంతో ఇతర నటీనటులకు కూడా ఛాన్స్ ఇస్తే అప్పుడు మళ్లీ చిరు హిట్ ట్రాక్ లోకి ఎక్కే అవకాశం ఉంటుంది. మరి చిరు ఫాలో అవుతాడో లేదో చూడాలి.