»Srikakulam Another Maid Who Killed A Maid Because Of An Extra Marital Affair
Affair: వివాహేతర సంబంధం..తోటి పని మనిషిని హతమార్చింది
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. రిటైర్మెంట్ డాక్టర్ ఇంట్లో హత్య జరిగింది. వివాహేతర సంబంధం బయటపడుతుందనే భయమే ఈ హత్యకు ప్రధాన కారణం అని తెలుస్తుంది. యజమానికి భయపడే హత్య చేసినట్లు నిందితురాలు కూడా ఒప్పుకోవడం విశేషం.
Srikakulam, another maid who killed a maid because of an extra-marital affair
Affair: ఏపీలోని శ్రీకాకుళం(Srikakulam) జిల్లా కేంద్రంలో ఇటీవల కలకలం రేపిన మహిళ దారుణ హత్యను ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. అయితే ఈ క్రైమ్‌లో ట్విస్ట్ చూస్తే మతిపోతుంది. లేనిపోని అనుమానం అభం శుభం తెలియని మహిళను హత్యచేసేలా పురిగొల్పింది. వివాహేతర సంబంధాని(extra-marital affair)కి అడ్డుగా ఉందనే కారణంతో ఓ పని మనిషి మరో పని మనిషిని చంపేసిందని నిర్ధారించి ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి జిల్లా రూరల్ ఎస్సై విజయ్‌కుమార్ ఈ మేరకు శుక్రవారం వివరాలు వెల్లడించారు.
శ్రీకాకుళం(Srikakulam) నగరం పెద్దపాడులోని ఓ రిటైర్డ్ వైద్యుడి ఇంట్లో 15 ఏళ్ల నుంచి రాజు అనే మహిళ పని చేస్తోంది. అదే ఇంట్లో 10 ఏళ్ల నుంచి చిట్టెమ్మ అనే మరో పని మనిషి కూడా పనిచేస్తుంది. అయితే యజమాని విశాఖపట్నంలోని కుమారుడి వద్ద ఉంటూ అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాడు. దీంతో ఇంటికి సంబంధించిన పనులను ఇద్దరు పని మనుషులకు అప్పగించారు. ఓనర్ లేని సమయంలో చిట్టేమ్మ ఒక వ్యక్తిని ఇంటికి రమ్మంది. ఆ తంతంగాన్ని రాజు అనే మరో పనిమనిషి చూసింది.
ఈ క్రమంలో చిట్టెమ్మ వివాహేతర సంబంధం విషయం రాజుకు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య ఆగస్టు 14న గొడవ జరిగింది. రాజు ఎంతో కాలంగా నమ్మకంగా ఆ ఇంట్లో పనిచేస్తుండడం, తాను ఏం చెప్పినా యజమాని నమ్ముతాడని ఆమె భయపడింది. వెంటనే ఆమెను అంతమొందించాలని చిట్టెమ్మ భావించింది. ప్రణాళిక ప్రకారం వంట గదిలోని చెక్కపీటతో రాజు తలపై బలంగా కొట్టి హతమార్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేబట్టారు. ఘటనా స్థలంలో ఆధారాలను పరిశీలించిన తరువాత చిట్టెమ్మపై అనుమానంతో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో తాను రాజును చంపినట్లు ఒప్పుకుందని పోలీసులు తెలిపారు.