Police: హైదరాబాద్‌లో సినిమాను తలపించే..బెగ్గింగ్ మాఫియా గుట్టు రట్టు
సిగ్నల్స్ దగ్గర బిక్షాటన చేసేవారు నిజమైన బెగ్గర్స్ కాదనే సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే వారు డైలీ లేబర్స్ అంటా. అంతేకాదు వారిని ఓ ముఠా కూలీ పనులకు తీసుకొచ్చి ఈ దందా నిర్వహిస్తుంది. అయితే ఈ స్కాంలో ఎవరు ఉన్నారో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
Police: హైదరాబాద్(Hyderabad) నగరంలో సిగ్నల్స్ దగ్గర బెగ్గర్స్(Beggers) ఎక్కువగా కనిపిస్తుంటారు. వారిని చూస్తే జాలేస్తుంది. వారు అర్థించేది ఆకలికోసమే కదా అని ఎంతో కొంత ఇస్తుంటాము. అయితే వారు అడ్డుక్కునే వారు కాదు. వారు కూలీలు అంటే నమ్ముతారా? మీరు విన్నది నిజమే. సినిమాల్లో చూపించినట్లుగా నగరంలో బెగ్గింగ్ రాకెట్‌ను(begging racket) నిర్వహిస్తున్న వారిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు(Police) ఛేదించారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ వద్ద 23 మందిని అరెస్ట్ చేశారు. ఈ మాఫియా నిర్వాహకుడు అనిల్ పవార్ కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వృద్ధులను కూలికి తీసుకొచ్చి ఇక్కడ బిక్షాటన చేయిస్తున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే వారికి ప్రతి ఒక్కరికీ రూ.200 ఇస్తూ వచ్చిన మొత్తాన్ని అనిల్ తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.
అయితే రోజుకు ఒక్కో బెగ్గర్ 4500 నుంచి 6000 వవరకు సంపాదిస్తారని వారి నుంచి మొత్తాన్ని తీసుకొని వారికి రెండు వందలు ఇస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా నగరంలో చాలా చోట్ల వీరు కనిపిస్తుంటారు. చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు దాదాపు అన్ని సిగ్నల్స్ దగ్గర ఉంటారు. వీరందరి వెనుకాల కూడా కచ్చితంగా ఎవరో ఒకరు ఉండేఉంటారు అని అధికారులు అనుమానిస్తున్నారు. ఇక సిటీలో సికింద్రబాద్లాంటి ఏరియాలో చాలా మంది బిచ్చగాల్లు ఉంటారు. రెండు జంటనగరాల్లో మొత్తం ఎంత మంది ఉంటారు. ఒక వ్యక్తి రోజుకు అంత సంపాదిస్తున్నాడంటే మొత్తం వీరంత సంపాదిస్తున్న ధనం అంతా ఎవరు తీసుకుంటున్నారు. వీరి వెనుక ఉన్నవారెవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.