»Man Posts About Unruly Passenger At Abu Dhabi Airport Lounge
Ugly: ఎయిర్ పోర్ట్ లాంజ్‌లో అగ్లీ సీన్, ప్యాసెంజర్‌పై నెటిజన్ల ఆగ్రహాం
ఎయిర్ పోర్ట్ లాంజ్‌లో ఓ ప్రయాణికుడు ప్రవర్తించిన తీరును నెటిజన్లు ఖండిస్తున్నారు. అక్కడ ఉండి అరవడం ఏంటీ..? ఫుడ్ తిని కనీసం వెస్టేజ్ పారేయకుండా అలా పెట్టడం ఏంటీ అని అడుగుతున్నారు.
Man posts about unruly passenger at Abu Dhabi airport lounge
Ugly: ప్యాసెంజర్స్ రెస్ట్ తీసుకోవడానికి ఎయిర్ పోర్ట్‌లో (Airport) లాంజ్స్ ఉంటాయి. రెస్ట్ తీసుకొని, అక్కడే ఉంటారు. తమ ఫ్లైట్ వచ్చేవరకు కూల్‌గా ఉంటారు. కానీ ఓ ప్రయాణికుడు (passengers) మాత్రం అక్కడ రచ్చ రచ్చ చేశాడు. అబుదాబి ఎయిర్ పోర్టులో లాంజ్‌లో అతను చేసిన హంగామా అంత ఇంత కాదు. దానికి సంబంధించి ఫోటోలు హిమ్స్ (hims) అనే యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. నెటిజన్లు ఏకీపారేస్తున్నారు.
లాంజ్‌లో సీటు తీసుకున్నాను అని చెప్పిన కూడా వినిపించుకోలేదట. తనతో ఫ్యామిలీ ఉందని చెప్పినా లెక్కచేయలేదట. డ్రింక్స్ (drinks) కోసం వెళ్లి వచ్చేసరికి సీటు అక్రమించాడని రాసుకొచ్చారు. అక్కడ మరో సీటు లేకపోవడంతో అతనిని అడిగామని చెప్పారు. పక్కన ఉన్న వారి రగ్, బెడ్ సీట్ మీద ఆహారం పడేశాడని తెలిపారు. అక్కడే ఆహారం తినేశాడని..దానిని డస్ట్ బిన్లో వేయలేదని తెలిపారు. ఇంకా ఫుడ్ కావాలని చప్పట్లు కొట్టి మరీ పిలిచాడని పేర్కొన్నారు. ఫోన్లో గట్టిగా మాట్లాడాడు అని.. దీంతో అక్కడ ఉన్న మిగతావారు చాలా ఇబ్బంది పడ్డారని వివరించారు.
అతని మాటలను బట్టి ఫైనాన్షియల్ సెక్టార్‌కు (financial sector) చెందినవాడని గుర్తించామని.. అతని ప్రవర్తన మాత్రం అంత ప్రొఫెషనల్‌గా లేదన్నారు. ఆ ఫోటోలు పోస్ట్ చేయగా.. నెటిజన్లు స్పందిస్తున్నారు. బ్యాడ్, అరొగంట్, అన్ కల్చర్డ్ బిహేవియర్ అని విరుచుకుపడ్డారు. ఇలాంటి ప్రవర్తన సరికాదని అంటున్నారు. ఎయిర్ పోర్టు లాంజ్‌లోకి వచ్చిన క్రెడిట్ కార్డ్ హోల్డర్స్, ప్రియారిటీ పాస్ హోల్డర్స్ ఇలా ప్రవర్తించడం సరికాదు. రోడ్డు వైపున నిలబడి తినేవారిలాగా ఉండటం ఏంటీ అని మండిపడ్డారు.