»High Temperatures In Telangana Thunderstorm Till August 20
Telangana: తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు..ఆగస్టు 20 వరకు ఉక్కపోతలు!
తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 20వ తేది వరకూ ఉక్కపోతలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు తగ్గుముఖం పట్టడంతో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
తెలంగాణ(Telangana) రాష్ట్రంలో రుతుపవనాలు కదలిక తగ్గింది. దీంతో వర్షాల తాకిడి తక్కువైంది. మూడు రోజులకు ముందు రాష్ట్రంలో అడపాదడపా వర్షాలు పడ్డాయి. అయితే ఇప్పుడిప్పుడే ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కినట్లైయ్యింది. దీంతో ప్రజలకు ఉక్కపోతలు తప్పలేదు. ఆగస్టు 20వ తేది వరకూ తెలంగాణలో ఉక్కపోతలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా దట్టమైన మేఘాలు ఉంటాయే తప్పా వర్షాలు(Rain) అంతగా కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా ఆగస్ట్ నెలలో భారీ ఎత్తున వర్షాలు కురవాల్సి ఉందని, అయితే ఈసారి ఎండలు తీవ్రంగా ఉంటాయని వెల్లడించింది. రాష్ట్రంలో రుతుపవనాల కదలిక నెమ్మదిగా ఉన్నట్లు తెలపింది. అయితే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది.
ఆగస్టు 11వ తేది వరకు ఇండియా(India)లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగస్టు 10వ తేది వరకు ఉత్తరాఖండ్లో భారీ వర్షాల పడతాయని, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా వర్షాలు భారీగా పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆగస్టు 11వ తేది తర్వాత పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Weather Department) వెల్లడించింది.