ప్రకాశం: దర్శి సమీపంలోని అచ్చన్న చెరువు వద్ద 13వ శతాబ్దం నాటి నాగశాసనం బయటపడింది. ఈ శాసనాన్ని పరిశీలించిన శాస్త్రవేత్త శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ.. క్రీ.శ 1317లో ఈ ప్రాంతాన్ని నాగవంశస్తులు పరిపాలించారన్నారు. ఆ సమయంలో నాగవంశ రాజైన అష్టదేవ మహారాజు తన తల్లి జ్ఞాపకార్థం అచ్చన్న చెరువును తవ్వించి వేణుగోపాల స్వామి గుడిని నిర్మించి శాసనాన్ని వేశారన్నారు.