టీడీపీ నేతల దౌర్జన్యకాండపై సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) స్పందించారు. వైఎస్సార్సీపీ శ్రేణులు సంయమనంతో ఉన్నారు. కావాలనే చంద్రబాబు (Chandrababu) గొడవలు సృష్టిస్తున్నారని సజ్జల అన్నారు. బాబు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. తమ పార్టీ శ్రేణులను ఆయన రెచ్చగొడుతున్నారు. రాయలసీమలో గొడవలకు చంద్రబాబే బాధ్యత వహించాలిని ఆయన అన్నారు. అంగళుల్లో పథకం ప్రకారమే టీడీపీ (TDP) నేతలు విధ్వంసం సృష్టించారు. టీడీపీ శ్రేణుల దాడుల్లో పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.
తానే శాశ్వతంగా అధికారంలో ఉండాలనే పిచ్చితో చంద్రబాబు ఉన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు’ అని ఫైరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో చిత్తూరు జిల్లా పుంగనూరు(Punganur)లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ‘ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పర్యటనలో భాగంగా అంగళ్లు (Angallu) నుంచి పుంగనూరు బయల్దేరిన చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ (YCP) శ్రేణులు విశ్వప్రయత్నం చేశాయి. రహదారికి అడ్డంగా లారీని అడ్డు పెట్టారు. లారీ అడ్డు తొలగించాలని ఆందోళనకు దిగిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జి చేశారు.