Rashi khanna: బాయ్ ఫ్రెండ్ వల్లె ఇలా అయ్యాను..హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
క్యూట్ అండ్ హాట్ బ్యూటీ రాశి ఖన్నా(rashi khanna) తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే న్యూస్ చెప్పి షాక్ ఇచ్చింది. అంతేకాదు.. అతనితో డేటింగ్ చేయడం వల్లే తాను ఇలా తయారయ్యానని చెప్పింది. అసలు ఇప్పటి వరకు అమ్మడి బాయ్ ఫ్రెండ్ గురించి ఎవరికీ తెలియదు. దీంతో అతనెవరనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
కెరీర్ స్టార్టింగ్‌లో చాలా క్యూట్‌గా ఉండే రాశి ఖన్నా(rashi khanna ).. ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచేసింది. అమ్మడిని చూస్తే.. ఊహలు గుసగుసలాడే సినిమాలోనే నటించింది ఈమెనా? అనేలా రెచ్చిపోతోంది. కొన్నాళ్ల క్రితం టాప్ హీరోయిన్లలో ఒకరుగా ఉన్న రాశి.. ఇప్పుడు ఫేడవుట్ స్టేజ్‌లో ఉంది. అందుకే.. ఎలాగైనా సరే మేకర్స్ దృష్టిలో పడేందుకు కాస్త గట్టిగానే అందాల విందు చేస్తోంది. బాలీవుడ్ పై కూడా ఫోకస్ చేస్తోంది. ఆఫర్ల కోసం టెంప్ట్ చేసేందుకు రాశిఖన్నా సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు.. మామూలుగా ఉండడం లేదు. ఈ మధ్య అమ్మడు చాలా స్లిమ్‌గా కనిపిస్తూ.. ఎద అందాలు, థై షో చేస్తోంది. అయితే గతంలో తాను కొంచెం లావుగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా నాజుగ్గా తయారయింది ఈ బోల్డ్ బ్యూటీ. అయితే దీనంతటికి కారణం తన బాయ్ ఫ్రెండేనని చెప్పి షాక్ ఇచ్చింది రాశి.
అసలు ఇప్పటి వరకు రాశిఖన్నా ఫలానా వ్యక్తితో డేటింగ్(dating)లో ఉందనే వార్తలు చాలా తక్కువ. కానీ తనే తన బాయ్ ఫ్రెండ్(boy friend) గురించి చెప్పింది. గతంలో ఒక వ్యక్తితో డేటింగ్ చేశానని.. కానీ అతనితో బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అప్పుడే బరువు పెరిగాను. దానికి తోడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల మరింతగా బరువు పెరిగాను. ఆ తర్వాత ఎంత ట్రై చేసినా కూడా వెయిట్ లాస్ అవలేదు. దీని వల్ల సినిమాలపై ఎఫెక్ట్ పడింది.. అని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు వెయిట్ లాస్ అవడానికి కూడా బాయ్ ఫ్రెండేనని చెప్పింది. ఫస్ట్ బ్రేకప్ డిస్టర్బెన్స్ సమయంలో నన్ను అర్ధం చేసుకునే వ్యక్తి దొరికాడు. ప్రజెంట్ అతనితో డేటింగ్‌తో ఉన్నాను. అసలు అతినితో డేటింగ్ స్టార్ట్ అయ్యాకే బరువు తగ్గాను. ఎలా తగ్గానో అర్ధం కాలేదు.. కానీ చాలా స్లిమ్ అయ్యాను. ఇప్పుడు తాను అనుకున్న షేప్‌లోకి వచ్చేశాను.. ఈ విషయంలో ఫుల్ హ్యాపీ అని.. చెప్పుకొచ్చింది రాశి. కానీ అమ్మడు ఎవరితో డేటింగ్లో ఉందనే విషయాన్ని మాత్రం సస్పెన్స్‌లో పెట్టింది. దాంతో ఎవరా లక్కీ గాయ్ అంటూ.. తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్.