88 Percent Rs.2 Thousand Notes Are Returned To Banks:RBI
Rs.2 Thousand Notes: రూ.2 వేల నోట్లను ఆర్బీఐ (rbi) రీ కాల్ చేయగా బ్యాంకులకు చేరుతున్నాయి. జూలై 31వ తేదీ వరకు 88 శాతం నోట్లు బ్యాంకులకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. వీటి విలువ రూ.3.14 లక్షల కోట్లని పేర్కొంది. మరో 0.42 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు మార్కెట్లో ఉన్నాయని స్పష్టంచేసింది.
రూ.2 వేల నోట్లను (rs.2 thousand note) విత్ డ్రా చేసుకుంటున్నాం అని మే 19వ తేదీన ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. మార్చి 31వ తేదీ వరకు రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు చలామణీలో ఉండగా మే 19వ తేదీ నాటికి ఆ మొత్తం రూ.3.56 లక్షల కోట్లకు తగ్గింది. రూ.2 వేల నోటును మార్చుకునేందుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు ఉంది. ఇప్పటివరకు వెనక్కి వచ్చిన నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో వచ్చాయని ఆర్బీఐ తెలిపింది.
1 శాతం (1 percent) మాత్రమే వేరే నోట్లతో తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను మార్పిడి చేసుకున్నారని ఆర్బీఐ పేర్కొంది. చివరి నిమిషం వరకు హైరానా పడొద్దని కోరింది. మరో 2 నెలల సమయం ఉందని.. ఈ లోపు బ్యాంకుల్లో రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేసుకోవాలని సూచించింది.