మైలవరం ఎమ్మెల్యే, వైసీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు ఒక్కోసారి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అని అనిపిస్తూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయాలు చూస్తూనే ఉన్నానని చెప్పారు. తాను చిన్నతనంలో తన తండ్రి రాజకీయాల్లో ఉన్నారని ఆయన అన్నారు. అయితే…. ఒకప్పటి రాజకీయాలకీ, ఇప్పటి రాజకీయాలకీ చాలా తేడాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
ఒక్కోసారి రాజకీయాల్లోకి వచ్చి.. ఎమ్మెల్యేను ఎందుకయ్యానా అని బాధపడుతున్నానని కామెంట్ చేశారు. సగటు వ్యక్తులకు కొన్నిసార్లు సాయం చేయలేకపోతున్నామని అన్నారు. రౌడీలను వెంటేసుకుని వారిలా ప్రవర్తిస్తేనే ముందడుగు వేసేలా ఉన్నాయన్నారు. తాను గత మూడున్నరేళ్లలో ఎక్కడా అక్రమ కేసులు పెట్టించలేదని వ్యాఖ్యానించారు. పథకాలు ఆపలేదని.. కేసుల విషయంలో కొంతమంది తమ నాయకులకు తనపై అసంతృప్తి ఉండొచ్చన్నారు.