మీరెప్పుడైనా మూడు కళ్లు ఉన్న ఎద్దును ఎక్కడైనా చుశారా? చాలా అరుదు అనే చెప్పవచ్చు. అంతేకాదు ఆ ఎద్దుకు కొమ్ములు కూడా మూడే ఉండటం విశేషం. దానిని చూసిన అక్కడి స్థానికులు పరమశివుడి అవతారంగా భావిస్తూ మొక్కుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సాధారణంగా ఎద్దుకు రెండు కళ్లు, రెండు కొమ్ములు ఉంటాయి. కానీ ఓ ఎద్దుకు మాత్రం వినూత్నంగా మూడు కొమ్ములు(three horns), మూడు కళ్లు(three eyes) ఉన్నాయి. అవును. ఇది ఎక్కడో కాదు. మధ్యప్రదేశ్(madhya pradesh) ఉజ్జయిని(ujjain)లోని శ్రీమహాకాల్ ఆలయం వెలుపల ఈ ఎద్దు కనిపించింది. దీనిని గమనించిన స్థానికులు కెమెరాల ద్వారా వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ ఎద్దును చూసిన స్థానికులు కొంత మంది ఇది పరమశివుడి అవతారమని, నంది మహారాజ్ అని భావిస్తూ మొక్కుతున్నారు కూడా. ఇది పవిత్ర జంతువని భావిస్తు ఆ ఎద్దుతో ఫొటోలు దిగడంతోపాటు వీడియోలు తీసుకుంటూ స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రత్యేకమైన ఎద్దు గురించి వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అది ఎలా ఉందో మీరు కూడా ఓసారి వీడియో చూసేయండి మరి.