టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ కి బీసీసీఐ అండగా నిలిచింది. పంత్… ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగే ఐపీఎల్ లో ఆడలేకున్నా ఆయనకు పూర్తిగా.. 16 కోట్ల రూపాయల వేతనాన్ని, 5 కోట్ల సెంట్రల్ కాంట్రాక్ట్ సొమ్మును చెల్లించనుంది. పంత్ వైద్య ఖర్చులను భరించడమే గాక.. ఆయన కమర్షియల్ ప్రయోజనాల బాధ్యతను కూడా తీసుకోవాలని నిర్ణయించింది.
ఢిల్లీ కేపిటల్స్ నుంచి ఆయనకు 16 కోట్ల వేతనం అందేలా చూస్తామని, అలాగే 5 కోట్ల సెంట్రల్ కాంట్రాక్ట్ పేమెంట్ కూడా ఆయనకు లభిస్తుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. తీవ్ర గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిషబ్ పంత్ మరో 6 నెలల వరకు క్రికెట్ ఆడలేడని, కోలుకోవడానికి ఇంకా సమయం పట్టవచ్చునని అధికారులు చెబుతున్నారు.