»Revanth Reddy Congress Besieged The Ghmc Office Over The Compensation Of Hyderabad Flood Victims
Congress: కమిషనర్‌ను ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు
నగరం నీట మునగడంపై అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఎన్ఎస్యూఐ.. జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఇదేనా డల్లాస్ అని ప్రశ్నించగా జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ సీరియస్ గా వెళ్లిపోయారు.
Revanth Reddy, Congress besieged the GHMC office over the compensation of Hyderabad flood victims.
Congress: భాగ్యనగరంలో వరద బాధితులకు(Hyderabad flood victims) ప్రభుత్వం తక్షణమే రూ.10,000 ఆర్ధిక సహాయం(compensation) అందించాలని కాంగ్రెస్ పార్టీ(Congress party) శుక్రవారం జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని( GHMC office) ముట్టడించింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పిలుపు మేరకు పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్(Anjan Kumar Yadav) మాట్లాడుతూ.. హైదరాబాద్ ను డల్లాస్ చేస్తామన్నారు ఇదేనా డల్లాస్(Dallas) అని ప్రశ్నించగా జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్(GHMC Commissioner Ronald Ross) సీరియస్ గా వెళ్లిపోయారని చెప్పారు. వెంటనే వరద బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ చెప్పకపోవడంతో కమిషనర్ ఏం మాట్లాడలేదన్నారు. ముంపు ప్రాంత వాసులకు నిత్యావసర సరుకులు అందించాలని కమిషనర్ ను కోరినట్లు పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి(Mallu Ravi) తెలిపారు.
బల్దీయా నీట మునగడంపై అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఎన్ఎస్యూఐ(NSUI).. జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టామని, అయితే పోలీసులు తమను అడ్డుకొని అరెస్ట్ చేశారని బల్మూర్ వెంకట్(Balmur Venkat) చేసిన ట్వీట్ ను రేవంత్ రెడ్డి రీ ట్వీట్ చేశారు. పోలీసులు తమను అమానుషంగా అడ్డుకొని అరెస్ట్ చేసినట్లు వెంకట్ ట్వీట్లో తెలిపారు. నగరం నీట మునిగితే కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) నిమ్మకు నీరెత్తనట్లు ఉన్నారని, ప్రభుత్వ వైఖరికి నిరసనగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ నేతలు జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడించారని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఉపాధి లేని పేదలకు, కార్మికులకు రూ.10,000 చొప్పున వెంటనే ఇవ్వాలని, వరదల్లో మునిగిపోయిన ప్రాంతాలను వెంటనే పునరుద్ధరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ నిరసనలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ యువనేత రఘునాథ్ యాదవ్ సహా పలువురు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.