కేంద్ర దర్యాప్తు సంస్థలు మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు (Supreme Court) పరిగణనలోకి తీసుకుంది. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌర్ ధర్మాసనం… దానిపై విచారణ జరపాలని నిర్ణయించింది. కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ఆరు వారాల్లో కౌంటర్ (Counter) దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. ఆ తర్వాత రెండు వారాల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని కవితకు సూచించింది. సీఆర్పీసీ, మనీలాం డరింగ్ యాక్ట్ 50 ప్రకారం.. మహిళలను ఇంటి దగ్గరే ప్రశ్నించాల్సి ఉందని పిటిషన్ (Petition) లో పేర్కొన్నారు.
సోమవారం కవిత పిటిషన్ను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు లియాతో కూడిన బెంచ్ శుక్రవారానికి వాయిదా వేసింది.ఉమెన్లను దర్యాఫ్తు సంస్థల ఆఫీసుల్లో ఎలా విచారిస్తారని కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై కవిత తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్(Kapil Sibal), ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. విచారణకు తెలంగాణ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వోకేట్ జనరల్ జే రామచంద్ర రావు (J Ramachandra Rao) హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవితను దర్యాఫ్తు సంస్థలు విచారించిన విషయం తెలిసిందే.