»Dogs Chasing Away Leopards Enter Into The House Maharashtra
Viral Video: చిరుతపులిని తరిమికొట్టిన డాగ్స్
మన ఇంట్లోకి సాధారణంగా ఎవరైనా కొత్తవాళ్లు వచ్చినా లేదా ఇతర జంతువులు వచ్చినా కూడా పెంచుకునే శునకాలు అప్రమత్తంగా ఉంటాయి. యజమానులు వచ్చే వరకు లేదా అవి బయటకు పోయే వరకు అరుస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇటివల ఓ ఇంట్లోకి ఏకంగా చిరుతపులి వచ్చింది. దాన్ని చూసిన శునకాలు బెదిరిపోకుండా అరుపులు చేస్తూ అది పారిపోయే వరకు వెంబడించాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
మాములుగా అయితే ప్రతి ఇంట్లో కుక్క(dog)నే సింహంగా భావిస్తారు. ఎవరైనా కొత్తవాళ్లు వస్తే అరుపులు చేయడం సహా ఇంటికి కాపాలాగా శునకాలు ఉంటాయి. కానీ తాజాగా ఓ ఇంట్లోకి ఏకంగా చిరుత దూసుకొచ్చింది. ఆ క్రమంలో ఇంట్లో ఉన్న శునకాలు బెదిరిపోకుండా దానిపై తిరగబడ్డాయి. అది బయటకు పారిపోయేవరకు దానిపై అరుస్తూ వెళ్లగొట్టాయి. ఈ సంఘటన మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఆ సంఘటన మహారాష్ట్ర(maharashtra)లోని నాసిక్‌లోని అద్గావ్ షివార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. దానిని కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పోస్ట్ చేయగా ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అయితే వీడియోలో ఓ శునకం పడుకుని ఉండగా దానిని తినేందుకు నెమ్మదిగా చిరుతపులి వచ్చింది. ఆ క్రమంలో పక్కనే మేల్కొని ఉన్న మరో కుక్క చిరుతపులి(leopard)ని చూసి మొరగడం ప్రారంభించింది. దీంతో పడుకున్న శునకం కూడా లేచి రెండు కుక్కలు ఆ చిరుతను మెరుగుతూ తరిమి కొట్టాయి. అయితే చిరుతపులి..ఆ నివాసానికి సమీపంలోని పొలం ప్రాంతం నుంచి ఆ చిరుత వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఆ తర్వాత అటవీశాఖ సహకారంతో ఓ బోను ఏర్పాటు చేసినప్పటికీ చిరుతపులి మాత్రం ఎవ్వరికీ కనిపించలేదు.