»Today Is The First Odi Cricket Match Between India And West Indies
INDvsWI: ఇండియా విండీస్ తొలి వన్డే నేడే
వెస్ట్ ఇండీస్‌పై టెస్ట్ సిరీస్‌లో సత్తా చాటిన భారత్ గురువారం వన్డే సిరీస్ ప్రారంభించనుంది. మరీ ఈ మ్యాచ్లోనన్న భారత్‌కు గట్టి పోటీ ఇస్తుందా లేదా అనేది చూడాలి.
Today is the first ODI cricket match between India and West Indies
INDvsWI: కరేబియన్ గడ్డపై సత్తా చాటుతున్న ఇండియన్ టీమ్(Team India) నేడు వన్డే మ్యాచ్ కు సిద్ధం అయింది. టెస్ట్ సిరీస్‌లో దూకుడును ప్రదర్శించిన రోహిట్ సేనా 1-0తో విజయం సాధించింది. గురువారం సాయంత్రం 6 గంటలకు ఇరు జట్ల వన్డే సిరీస్ కోసం పోటీ పడనున్నాయి. భారత్, వెస్టిండీస్ (Wi vs Ind) జట్లు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్(ODI Series) కు సిద్ధమయ్యాయి. గురువారం ఇరు జట్ల మధ్య తొలి పోరు(1st ODI) జరుగనుంది. వన్డే ప్రపంచకప్ టోర్నీకి సమయం దగ్గర పడుతున్న వేళ భారత్ ప్రతీ మ్యాచ్‌ను కీలకంగా భావిస్తున్నది. రాబోవు ఆసియా ప్రపంచకప్ పోటీలకు సన్నద్ధం అవుతోంది. తెలుగు అభిమానులుకు ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్పై డీడీ స్పోర్ట్స్ (DooraDarshan Sports) శుభవార్త తెలిపింది.
ఈ మ్యాచ్‌ను ఓటీటీ వేదికగా సాయంత్రం 6 గంటల నుంచి జియో సినిమా (Jio Cinema) ప్రత్యక్షంగా ప్రసారం చేస్తుంది. దీనిలో కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కామెంట్రీ మాత్రమే అందిస్తుండగా, తెలుగు, కన్నడ, తమిళ్, భోజ్‌పురి, బెంగాలి భాషల్లో డీడీ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు దూరదర్శన్ ప్రకటించింది. ఇక తెలుగులో కామెంట్రీ కోసం డీడీ సప్తగిరి, డీడీ యాదగిరి అందుబాటులో ఉన్నాయని దూరదర్శన్ స్పోర్ట్స్ ట్విట్టర్ ద్వారా పేర్కొంది. వన్డే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించలేపోయిన విండీస్.. సొంతగడ్డపై సత్తాచాటాలని చూస్తున్నది. షిమ్రాన్ హిట్మైర్, ఓషానె థామస్ తిరిగి జట్టులోకి రావడం ఆ జట్టుకు బలం లాభించే అవకాశముంది. వీరికి తోడు షాయి హోప్, రోవ్‌మన్ పావెల్ రాణిస్తే భారత్‌కు గట్టి పోటీ ఏర్పడుతుంది. ఇక మన క్రికెటర్లో టాప్ 3 ప్లేయర్లుగా రోహిత్, శుభ్‌మన్, కొహ్లీలపై మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే ఆల్ రౌండర్లు అయిన హార్ధిక్ పాండ్య, జడేజాలపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.