»Morancha Village Submerged In Water In Telangana Roads Cut In Some Other Places Stuck Journey
Telangana:లో నీటమునిగిన మోరంచ గ్రామం..మరికొన్ని చోట్ల తెగిన రోడ్లు
తెలంగాణలో పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. మరికొన్ని చోట్ల ప్రజలు గల్లంతు కాగా, ఇంకొన్ని చోట్లు రోడ్లు తెగి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో తమకు సాయం అందించాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలతో అనేక ప్రాంతాలు నీటిమట్టం అయ్యాయి. ఈ క్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచ గ్రామం పూర్తిగా నీట మునిగింది. దాదాపు 200 ఇళ్లలోకి నీరు చేరింది. ఈ క్రమంలో ముగ్గురు గల్లైంతైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తమకు ఎవరైనా సాయం అందించాలని ఇళ్లపైకి ఎక్కి కోరుతున్నారు. మరికొంత మంది చెట్లు ఎక్కి ఆయా ప్రాంతాల్లోని వారు తమను తాము కాపాడుకుంటున్నారు. ఇప్పటికే చిట్యాల మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 61.6 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో పరిస్థితిని ఇక్కడ చుద్దాం.
బ్రేకింగ్ న్యూస్
పూర్తిగా జలదిగ్బంధంలో మోరంచపల్లె గ్రామం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా – పరకాల ప్రధాన రహదారి పై మొరంచ గ్రామం వద్ద దాదాపు 15 ఫీట్స్ ఎత్తులో ప్రవహిస్తున్న వాగు ఉప్పొంగడంతో పూర్తిగా నీట మునిగిన ఊరు.
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితల చెరువుకు కూడా పెద్ద ఎత్తున వర్షం నీటి వరద ప్రవాహం పోటెత్తుతోంది. దీంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ లోతట్టు ప్రాంతాల పంటలు మునిగిపోతాయోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నేపథ్యంలో పలువురు వెళ్లి ఆ చెరువు ప్రాంతంలోని ఓ వైపు నీరు బయటకు వెళ్లేందుకు పనులు చేస్తున్నారు. మరికొంత మంది తమకు సాయం చేయాలని కోరుతున్నారు.
ములుగు జిల్లా
రాష్ట్రంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి గుండ్లవాగు పొంగి ప్రవహిస్తుండటంతో గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి సమీపంలోని గుండ్లవాగు 163వ జాతీయ రహదారిపై నిర్మించిన బ్రిడ్జికి సమీపంలో రోడ్డు తెగిపోయింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతోపాటు ములుగు జిల్లా ముత్యాల ధార వాటర్ ఫాల్స్ సందర్శనార్థం వెళ్లి అడవిలో చిక్కుకున్న 82 మంది పర్యాటకులను నిన్న అర్ధరాత్రి వరకు శ్రమించి అధికారులు వారిని కాపాడటం జరిగింది. పర్యాటకులను అడవి నుంచి తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో సురక్షితంగా కాపాడి తీసుకొచ్చారు ఎన్డీఆర్ఎఫ్, జిల్లా పోలీసు యంత్రాంగం.
గుండ్లవాగు 163వ జాతీయ రహదారిపై బ్రిడ్జి తెగిపోయింది
ములుగు – రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి గుండ్లవాగు పొంగి ప్రవహిస్తుండటంతో గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి సమీపంలోని గుండ్లవాగు 163వ జాతీయ రహదారిపై నిర్మించిన బ్రిడ్జికి సమీపంలో రోడ్డు తెగిపోయింది.… pic.twitter.com/8AQn6VtjIB
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం, చాపరాలపల్లి వద్ద కుమ్మరివాగు దాటుతూ మహిళ గల్లంతైంది. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి కొద్ది సేపటి క్రితం రెండవ ప్రమాద హెచ్చరిక జారీలు చేశారు. గోదావరిలో రాత్రి 9.30 గంటలకు భద్రాచలం దగ్గర 48 అడుగులకు గోదావరి వరద నీరు చేరింది. ఇప్పటికే అధికారులు రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం ప్రధాన రహదారులపైకి చేరిన వరద నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి.
పెద్దపెల్లిలో వ్యక్తి గల్లంతు
పెద్దపెల్లి జిల్లాలో మానుపాటి వెంకటేష్ స్నేహితులతో కలిసి సబ్బితం వాటర్ ఫాల్స్ సందర్శనకు వెళ్లగా ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. దీంతో వాటర్ ఫాల్స్ వద్ద ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేశారు. నీటి ప్రవాహం అధికంగా ఉందని ఎవరు సందర్శనకు రావద్దని పోలీసులు కోరుతున్నారు.
విహారయాత్రలో విషాదం.. ప్రమాదవశాత్తు వాటర్ ఫాల్స్‌లో పడి యువకుడు మృతి
పెద్దపెల్లి – మానుపాటి వెంకటేష్ స్నేహితులతో కలిసి సబ్బితం వాటర్ ఫాల్స్ సందర్శనకు రాగా ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. వాటర్ ఫాల్స్ వద్ద ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం… pic.twitter.com/tOsIpmIydX
జగిత్యాల రూరల్ మండలంలోని అనంతారం గ్రామ రోడ్డు డ్యామ్ పై నుండి వరద ప్రవాహం పెరగడంతో ధర్మపూరి, జగిత్యాలకు వెళ్ళు రోడ్డును ఇరువైపులా రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ట్రాక్టర్లతో బారీకెడ్లను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత కల్పించడం జరిగిందని, ప్రజలందరూ సహకరించాలని జగిత్యాల రూరల్ పోలీసులు కోరారు.
నిజామాబాద్ జిల్లా
మరోవైపు ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామ శివారులోని నిజామాబాద్ జిల్లా ఎరుగట్ల తీగల వాగు నిండి రోడ్డుపై నుంచి ప్రవహిస్తుంది. దీంతో జగిత్యాల జిల్లా, నిజామాబాద్ జిల్లాకు రాకపోకలను నిలిపివేశారు.