»Important Decision Of Ap Court In Case Of Censorship Of Maa Tv Bigg Boss Reality Show
Bigg Boss: బిగ్‌బాస్ రియాల్టీ షోపై కోర్టు మళ్లీ ఆగ్రహం!
బిగ్‌బాస్ షో సెన్సార్ విషయంలో ఏపీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రసారం అయ్యాక పిటిషన్లను పరిశీలించడం అంటే పోస్ట్‌మార్టం చేసినట్లే అని ఘాటుగా స్పందించింది. ఈ విషయంపై కేంద్రానికి తగిన సూచలను ఇవ్వాలని పేర్కొంది.
Important decision of AP court in case of censorship of Maa tv Bigg Boss reality show
Bigg Boss: బిగ్‌బాస్ రియాల్టీ షో(BigBoss Reality Show)ను ఆధారించే వారున్నారు అంతే స్థాయిలో విమర్షించే వారున్నారు. ఈ షో ప్రసారం అవుతున్నప్పటి నుంచి చాలా రకాల వివాదాలు తెరపైకి వచ్చాయి. ప్రముఖులతో పాటు సీపీఐ నారాయణ(CPI Narayana) చేసిన వ్యాఖ్యలు తీవ్రదూమరాన్ని రేపాయి. ఇదే విషయంలో కోర్టుల్లో ఎన్నో పిటిషన్లు నమోదయ్యాయి. అయితే ఈ విషయంపై హైకోర్టు ఘాటుగా స్పందించింది. టీవీలో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సెన్సార్షిప్(Censorship) చేయకపోతే ఎలాగని ప్రశ్నించింది. ప్రసారం అయ్యాక దానిపై అభ్యంతారాలను, ఫిర్యాదులను పరిశీలించడం పోస్టుమార్టం చేయడం లాంటిదని తెలిపింది. ప్రస్తుతం షో ప్రసారం కావడం లేదని న్యాయస్థానం కళ్లు మూసుకుని ఉండలేదని పేర్కొంది. ఈ విషయంపై కేంద్రానికి తగిన సూచనలు ఇస్తామని వెల్లడించింది. అయితే పూర్తి వివరాలతో కౌంటరు వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మాటీవీ, ఎన్‌డేమోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్, సినీ హీరో అక్కినేని నాగార్జునలను ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ వెంకట జ్యోతిర్మయిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
బిగ్‌బాస్ షోలో చాలా వరకు అశ్లీలత ఉందని దీని వలన యువత తప్పుదారి పట్టే అవకాశం ఉందని తెలుగు యువశక్తి అధ్యక్షుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దాఖలు పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చాయి. న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపించారు. సెన్సార్ లేకుండా షోను ప్రసారం చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలను రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 లోపు ప్రసారం చేయాలన్నారు. ఎండేమోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తరఫున సీనియర్ న్యాయవాది సి.రఘు వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుతం బిగ్‌బాస్ షో ప్రసారం కావడం లేదన్నారు. ఈ వ్యాజ్యాలపై విచారణ నిరర్ధకమన్నారు. ఇక ముందు ప్రసారం కాబోయే కార్యక్రమంపై అభ్యంతరం ఉంటే తాజాగా పిల్ వేయడానికి పిటిషనర్‌కు స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు.
స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెట్ మాటీవీ(Maa TV) తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. బిగ్‌బాస్ షోకు అసలు సెన్సార్(Censor for Bigg Boss show)విధానం లేదన్నారు. అభ్యంతరాలు ఉంటే ప్రసారం అయ్యాక ఫిర్యాదు చేయవచ్చన్నారు. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ చట్టం ప్రకారం ఫిర్యాదులను పరిశీలించేందుకు మూడంచెల వ్యవస్థ ఉందన్నారు. ముందే సెన్సార్ చేయలంటే కేంద్రం చట్టం చేయాలన్నారు. అయితే షో నచ్చకపోతే ఛానల్ మార్చుకోవచ్చని పేర్కొన్నారు. ఇది భావవ్యక్తికరమైన స్వేచ్చగా పరిగణించాలని తెలిపారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు స్పందిస్తూ.. కార్యక్రమానికి ముందే సెన్సార్షిప్ లేకపోతే ఎలా అని ఈ విషయంలో కేంద్రం తగిన నిర్ణయం తీసుకోవాలి. ప్రసారమయ్యాక అందే ఫిర్యాదులపై చర్యలు తీసుకొని ఏం ప్రయోజనం అది పోస్టుమార్టం చేయడమే అవుతుంది అని పేర్కొంది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ చేస్తామని, హైకోర్టుకు ఉన్న విచారణాధికార పరిధికి అనుగుణంగా బిగ్‌బాస్ షో ప్రసారానికి ముందే సెన్సార్ చేసే వ్యవహారంపై కేంద్రానికి తగిన సూచనలిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. ఇలాగే వదిలేస్తే టీవీ రంగంలో కూడా అశ్లీలత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.