NGKL: లక్నారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇంటి గృహప్రవేశం నిర్వహించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పేదలకు ఇళ్లు అందించి వారి స్వంత ఇంటి కలను నెరవేర్చుతుందని ఆయన పేర్కొన్నారు.