»Virat Kohli Who Scored A Century In The Second Test Is Facing West Indies
IND vs WI: చితక్కొట్టిన కోహ్లీ.. విండీస్ కు చుక్కలు.!
భారత్, వెస్ట్ ఇండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో చెలరేగిపోయిన విరాట్ కోహ్లీ. 206 బంతుల్లో 121 కొట్టి విండీస్‌ను పరుగులు పెట్టించాడు. 438 టార్గెట్ తో బరిలో దిగిన ప్రత్యర్థులు ఆటముగిసే సమయానికి 86/1 గా నిలిచారు.
IND vs WI: భారత క్రికెటర్లు(Indian cricketers) ఫుల్ ఫామ్ లో ఉన్నారు. వీరి దాటికి వెస్ట్ ఇండీస్(West Indies)టీం సభ్యులు విలవిలలాడుతున్నారు. ఫస్ట్ టెస్ట్ ఒక ఇన్నింగ్స్ తేడాతో చిత్తుగా ఓడినా విండీస్ సెకండ్ టెస్ట్ కూడా అతికష్టంగా ఎదుర్కొంటోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 86/1 స్కోరు చేసింది. అందులో క్రెయిగ్ బ్రాత్‌వైట్(Craig Brathwaite) 37 పరుగులు, మెకంజీ(Mackenzie) 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో విడీస్ ఇంకా 352 పరుగులు చేయాల్సి ఉంది. ఇక 288/4తో రెండవ రోజు ఆటను కొనసాగించిన భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 438 పరుగులు చేసింది. ఇక భారత్ ఆలౌటైన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ ఓపెనర్లు బ్రాత్‌వైట్, త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్ (33) మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించారు. కాసేపు ఇద్దరు నిలకడగా ఆడారు. తరువాత త్యాగ్‌నారాయణ్ బౌండరీలు బాదాడు. అశ్విన్, సిరాజ్ బౌలింగ్‌లో బౌండరీలు సాధించిన చందర్ పాల్ కొద్దిసేపటికే జడేజా బౌలింగ్‌లో త్యాగ్‌నారాయణ్ అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన మెకంజీ ఓ సిక్స్, ఫోర్ బాదాడు. ఇక రెండో రోజుకు 86/1గా ఆటి ముగిసింది.
సచిన్ రికార్డు చిత్తు చేసిన కోహ్లీ
87 పరుగుల వ్యక్తిగత స్కోర్‌తో రెండో రోజు క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(Virat Kohli) 206 బంతుల్లో 11 ఫోర్లతో సెంచరీ బాదీ 121 పరుగులు చేశాడు. అద్భతమైన స్క్వేర్ డ్రైవ్‌తో 180 బంతుల్లో శతకం దాటించిన అతను తనదైన శైలీలో సంబరాలు చేసుకున్నాడు. కోహ్లీ నాలుగున్నరేళ్ల తర్వాత భారత్‌కు అవతల శతకం సాధించాడు. అయితే కోహ్లీ ఈ సెంచరీ ద్వారా అన్ని ఫార్మాట్లలో కలిపి 76 సెంచరీలు నమోదు చేశాడు. దీంతో సచిన్ టెండూల్కర్ పేరున ఉన్న 500 మ్యాచులో 75 సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ బద్దులుకొట్టేశాడు.
అలాగే జడేజా 152 బంతుల్లో 5 ఫోర్లతో 61 పరుగులు చేశాడు. ఇక సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ వారికన్ వేసిన 99వ ఓవర్లో రనౌట్‌గా వెనుదిరిగాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న కోహ్లీ సింగిల్‌కు ప్రయత్నించగా విండీస్ ఆటగాడు జోసెఫ్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో వికెట్‌కు నేరుగా బంతిని విసిరడంతో పెవిలియన్ చేరాడు. కొద్దిసేపటికే కీమర్ రోచ్ బౌలింగ్‌లో జడేజా వికెట్ కీపర్ ది సిల్వాకి క్యాచ్ ఇచ్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్ చక్కటి ఆటను కనబరిచాడు. 78 బంతుల్లో 8 ఫోర్లతో అర్థశతకం బాదీ 56 పరుగులు చేశాడు. అశ్విన్, ఇషాన్ (25), ఉనద్కత్ (7)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పారు. తన తొలి టెస్టులో పెద్దగా ఆడే అవకాశం దక్కని ఇషాన్.. రెండో అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నట్లే కనిపించాడు. అయితే అతడి ఇన్నింగ్స్‌ను హోల్డర్ ఔట్ చేశాడు. ఆ తర్వాత ఉనద్కత్, సిరాజ్ (0)లను స్పిన్నర్ వారికన్ పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో చకచకా కొన్ని షాట్లు ఆడి అర్ధశతకం పూర్తి చేసుకున్న అశ్విన్.. రోచ్ బౌలింగ్‌లో బౌల్డవడంతో ఇన్నింగ్స్‌కు తెరపడింది. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్ 3, వారికన్ 3, జేసన్ హోల్డర్ 2, గాబ్రియల్ ఒక వికెట్ తీశారు.