పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (CM Mamata Banerjee) కాళీఘాట్ నివాసంలోకి కారులో ఆయుధాలతో చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లకోటు, టై ధరించిన అతను పోలీస్ స్టిక్కర్ (Police sticker) తో కూడిన కారులో సీఎం నివాసంలోకి ప్రవేశించే ప్రయత్నం చేయగా అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అరెస్ట్ చేసినట్లు కోల్కతా సీపీ వినీత్ గోయల్ (CP Vineet Goyal)వెల్లడించారు. అతనిని నూర్ ఆలంగా గుర్తించినట్లు చెప్పారు. ఈ ఘటన జరిగినప్పుడు మమతా బెనర్జీ తన ఇంట్లోనే ఉన్నట్లు తెలిపారు.తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి తన కాళీఘాట్ (Kalighat) నివాసం నుండి నగరంలోని సెంట్రల్ ప్రాంతంలోని అమరవీరుల దినోత్సవం ర్యాలీ వేదికకు చేరుకోవడానికి కొన్ని గంటల ముందు ఈ సంఘటన జరిగింది.