అప్పటి వరకు అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లేలా సస్పెన్స్ మెయింటేన్ చేసిన నాగ్ అశ్విన్.. జస్ట్ ఒక్క పోస్టర్‌తో అనుమనాలు వచ్చేలా చేశాడు. అరె ఏంది మావా.. ఇలా చేశావ్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. కానీ నాగ్ అశ్విన్‌ను తక్కువ అంచనా వేసిన వారే.. ఇప్పుడు అదరొగొట్టాడని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
ఫస్ట్ లుక్ పోస్టర్‌తో వచ్చిన డౌట్స్ అన్నింటికి.. ప్రాజెక్ట్ కె(project k) గ్లింప్స్ చెక్ పెట్టేసింది. ఇన్నాళ్లు ప్రాజెక్ట్ కె అంటే ఏంటి? అని ఊరిస్తు వచ్చిన మేకర్స్..అమెరికాలోని శాన్‌డియాగో కామిక్ కాన్ 2023 వేదికపై టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ముందు నుంచి వినిపించినట్టుగానే ‘ప్రాజెక్ట్ కె’ అంటే ‘కల్కి 2898 ఏడి’ అని అనౌన్స్ చేశారు. ఇక గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇందులో ప్రపంచాన్ని కాపాడే ఆధునిక ‘కల్కి’గా కనిపిస్తున్నాడు ప్రభాస్(prabhas). ఇప్పటి నుంచి లెక్కేస్తే.. సరిగ్గా 875 సంవత్సరాల తర్వాత ప్రపంచం ప్రమాదపు అంచులో ఉన్నప్పుడు.. ప్రజలను ఆదుకోవడానికి ఒక సూపర్ హీరో వస్తాడు. అతనే కల్కి.. అని గ్లింప్స్‌తో చెప్పేశాడు నాగ్ అశ్విన్. ఇక ప్రభాస్ లుక్ మాత్రం మామూలుగా లేదు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి నాగ్ అశ్విన్ ఏం చేస్తాడో అని.. భయపడిన ప్రభాస్ ఫ్యాన్స్.. గ్లింప్స్ చూసి కాలర్ ఎగరేస్తున్నారు. ప్రభాస్‌ను ఓ రేంజ్లో ప్రెజెంట్ చేశాడు. ప్రభాస్‌కు సంబంధించిన కొన్ని పర్టిక్యులర్ షాట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. లాంగ్ హెయిర్‌తో హాలీవుడ్ రేంజ్లో సూపర్ హీరోగా ఉన్న ప్రభాస్ ఇంటెన్స్ అదిరిపోయింది.
కానీ టీజర్లో నాలుగు పాత్రలను మాత్రమే హైలెట్ చేశాడు. ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, హీరోయిన్ దీపికా పదుకొనెలను చూపించాడు. అయితే అనూహ్యంగా తమిళ నటుడు పశుపతి టీజర్లో హైలెట్ అయ్యా. ఇప్పటి వరకు పశుపతి ప్రాజెక్ట్ కేలో ఉన్నట్టు ఎక్కడా రివీల్ చేయలేదు. కానీ విలన్‌గా నటిస్తున్న కమల్ హాసన్(Kamal Haasan) మాత్రం ఎక్కడా కనిపించలేదు. టీజర్లో ఇదో అతి పెద్ద సస్పెన్స్‌గా మారింది. అసలు కమల్ హాసన్ పాత్ర ఏంటనేది ఎగ్జైటింగ్‌గా మారింది. అయితే కల్కి టీజర్లో కమల్ హాసన్ క్యారెక్టర్‌ను రవీల్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే పార్ట్ 2 లో కమల్ హాసన్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని, అందుకే.. పార్ట్ 1లో పెద్దగా హైలెట్ చేయలేదని అంటున్నారు. అన్నట్టు దిశా పటాని కూడా టీజర్లో కనిపించలేదు. ఇక ఫస్ట్ గ్లింప్స్‌లో సంతోష్ నారాయణ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రభాస్‌కు ఇచ్చిన ఎలివేషన్ బాగుంది. కాకపోతే.. కాస్త దసరా బీజిఎంను గుర్తుకు తెచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ విషయంలో నాగ్ అశ్విన్ కాస్త జాగ్రత్త పడితే చాలు.. పాన్ వరల్డ్ బాక్సాఫీస్ బద్దలవుతుందనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు.