Allu Arjun: బేబీ మూవీకి బన్నీ ఫిదా..తగ్గేదేలే అంటూ ప్రశంసలు!
ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా బేబీ మూవీ పేరే వినపడుతోంది. ఈ మూవీ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ మూవీని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వీక్షించారట. ఈ మూవీ చూసి సినిమాలో నటీనటులకు ఫిదా అయిపోయారు. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా వివరించారు.
బేబీ అప్రిషియేట్ మీట్ ఏర్పాటు చేసి మరీ, బన్నీ వారిపై ప్రశంసలు కురిపించాడు. బేబీ చిత్రాన్ని మీడియా బాగా సపోర్ట్ చేసిందంటూ ముందుగా వారికి థాంక్స్ చెప్పారు. ఈ మూవీ చూశాక తెలుగు సినిమా తగ్గేదెలే అని అన్నారు. బేబీ టీమ్ మొత్తానికి కంగ్రాట్యులేషన్స్ సినిమాతో చింపేశారు. నిజానికి లవ్లో పెయిన్ చూపించే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘కాదల్ కొండేన్, 7/G బృందావన్ కాలనీ, అర్జున్ రెడ్డి’ సినిమాలు ఇష్టం. కానీ అలాంటి సినిమాలు తీయడమే కష్టం. కొన్ని సినిమాలు చూసి లేదా స్క్రీన్ప్లే బుక్స్ చదివి అలాంటి కథలు రాయలేం. అవి జీవితంలో మనం చూసిన, అనుభవించిన విషయాలను నుంచి పుట్టుకొచ్చే సినిమాలు. ఇలా రియల్ ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి కష్టపడి ఈ స్టోరీ రాసి, సినిమాగా మలిచిన సాయిరాజేష్ గారికి ఎంత చెప్పినా కూడా తక్కువే. సినిమా అద్భుతంగా ఉంది. నాకు చాలా బాగా నచ్చిందని అన్నారు.
నాకు ఈ సినిమాలో చాలా విషయాలు నచ్చాయి. వాటి గురించి గంటసేపైనా చెప్పగలను. కథ రాసిన తీసిన విధానంతోపాటు డైరెక్టర్ గారు ఆర్టిస్ట్ నుంచి పెర్ఫామెన్స్ తీసుకున్న విధానం నచ్చింది. ఓవరాల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరి పనితనం స్క్రీన్ మీద కనపడింది. అందుకే ఒకటి చెప్పాలని అనుకుంటున్నా. చిన్న సినిమాలు చూడట్లేదు. గాడిద గుడ్డు చూడట్లేదు. అదేం కాదు. సినిమాలు బాగుంటే ఎందుకు చూడరని అన్నారు. చివర్లో అభిమానులు పుష్ప-2 డైలాగ్ కావాలని కోరగా ఆయన ఓ పంచ్ డైలాగ్ వినిపించారు. ఈడంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతాండాది. పుష్పా గాడి రూల్ అని మూవీలో డైలాగ్ లీక్ చేయడం విశేషం.