కేంద్ర మంత్రి అని చూడకుండా తన పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Union Minister Kishan Reddy) అన్నారు. తాము ఉద్యమం చేయలేదనీ, ధర్నా చేయలేదనీ.. డబుల్ బెడ్రూం ఇళ్లు చూసేందుకు వెళ్తే అడ్డుకోవడం ఏమిటన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt) నియంతృత్వ ఆలోచనలతో వ్యవహరిస్తోందన్నారు. విమానాశ్రయం నుండి తనను నేరస్థుడిలా దౌర్జన్యంగా వెంబడించారని తన పట్ల దౌర్జన్యంగా ఆవేదన వ్యక్తం చేశారు. తన పట్ల మానవత్వం లేకుండా వ్యవహరించారన్నారు. తాము ఏమైనా మత ప్రార్థనలు జరిగే ప్రాంతాలకు వెళ్తున్నామా? అని ప్రశ్నించారు.ప్రజల బాధలు చూసేందుకు వెళ్తే అరెస్ట్ చేయడమేమిటన్నారు.కేంద్రమంత్రిగా తనకు అక్కడకు వెళ్లే హక్కు లేదా? అని ప్రశ్నించారు.
ఒక నేరస్థుడితో, ఉగ్రవాదితో ఎలా వ్యవహరిస్తారో ఇవాళ తనతో పోలీసులు (POlice) అలా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్లో కూర్చొని ప్రశ్నించే గొంతులను అణచివేస్తారా? అని నిలదీశారు. బీజేపీ (BJP) నేతలను అరెస్ట్ చేసినంత మాత్రాన ప్రజల ఆవేదన, ఆక్రోశం తగ్గవన్నారు. తాము ఉద్యమం చేయలేదనీ, ధర్నా చేయలేదనీ డబుల్ బెడ్రూం ఇళ్లు (Double bedroom houses)చూసేందుకు వెళ్తే అడ్డుకోవడం ఏందుకని ఆయన ప్రశ్నించారు.డబుల్ బెడ్రూం ఇళ్లు చూసేందుకు వెళ్తే అడ్డుకోవడంఈ రోజు తెలంగాణలో యుద్ధం మొదలైందన్నారు. ప్రజల కోసం కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్తో యుద్ధానికి సిద్ధమన్నారు. తమ రాజకీయ జీవితమే పోరాటాలతో ప్రారంభమైందన్నారు. సీఎం కేసీఆర్ (CMKCR) కు దమ్ముంటే 50 లక్షల ఇళ్లు నిర్మించాలని, కేంద్రం నుండి వచ్చే వాటాను తాము తీసుకు వస్తామన్నారు.