»Komalee Prasad Is A Telugu Doctor Turned Actress Photos Gallery
Komalee Prasad: నటిగా మారిన తెలుగు వైద్యురాలు
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏపీ నటి కోమలీ ప్రసాద్(Komalee Prasad) క్రమంగా పలు సినిమాల్లో నటించి గుర్తింపు దక్కించుకుంటూ దూసుకెళ్తుంది. దీంతోపాటు ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో కూడా కొన్ని ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసి ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ అమ్మడు చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
శశివదనే, హిట్2 మూవీల్లో ఓ తెలుగు నటి కూడా యాక్ట్ చేసింది. మీకు తెలుసా? తెలియదా. ఆమెనే నటి కోమలీ ప్రసాద్. అటూ సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేస్తూ మరింత మంది అభిమానులను దక్కించుకుంటుంది.
ఈ అమ్మడు ఆగస్ట్ 24, 1995న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జన్మించింది. కర్ణాటకలోని బళ్లారిలో పెరిగింది.
ఆ భామ వృత్తి పరంగా సినిమాల్లోకి రాకముందు ఆమె వృత్తి రీత్యా దంతవైద్యురాలిగా పనిచేసింది.
కోమలీ ప్రసాద్ 2016లో నేను సీతాదేవి అనే తెలుగు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది.
ఆ తర్వాత 2020లో అనుకున్నది ఒకటి అయినది ఒకటి అనే తెలుగు చిత్రంలో నటించింది.
సెబాస్టియన్ పి.సి. 2022లో 524, వెబ్ సిరీస్ లూజర్ వంటి సినిమాల్లో యాక్ట్ చేసింది.