woman married 12 men: 12 మందిని పెళ్లాడిన మహిళ..పోలీసులు షాక్
ఓ మహిళ 12 మందిని పెళ్లాడింది. పెళ్లి చేసుకున్న ప్రతిసారీ ఆమె తన అత్తగారింటి నుంచి డబ్బు, నగలతో పరారయ్యేది. 12వ భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు.
ఓ మహిళ వరుసగా 12 మందిని పెళ్లిళ్లు చేసుకుని పరారైంది. పెళ్లి(Marriage) సందర్భంగా వచ్చిన డబ్బు, బంగారంతో ఆ మహిళ వరుడి ఇంటి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత ఇంకో ప్రాంతానికి చేరుకుని అక్కడున్న వ్యక్తిని పెళ్లాడుతుంది. ఇలా 12పైగా పెళ్లిళ్లు చేసుకుని(woman marries over 12 men) అందర్నీ మోసగిస్తోంది. ఈ ఘటన జమ్ముకశ్మీర్(Jammukasmir)లో చోటుచేసుకుంది.
బుద్గామ్కు చెందిన మహమ్మద్ అల్తాఫ్ మీర్‌కు 30 ఏళ్ల షాహీన్ అక్తర్‌తో నాలుగు నెలలకు ముందు వివాహం అయ్యింది. పెళ్లి సందర్భంగా ఇచ్చిన డబ్బులు, బంగారం తీసుకుని అతని ఇంటి నుంచి పరారైంది. భార్య ఆచూకీ తెలియకపోవడంతో జులై 5న మహమ్మద్ అల్తాఫ్ మీర్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో ఆమె రాజౌరి జిల్లాలోని నౌషేరాలో ఉన్నట్లు తేలింది. దీంతో ఆమెను జులై 14న అరెస్ట్ చేశారు.
పోలీసుల(Police) దర్యాప్తులో షాహీన్ అక్తర్‌కు ఇది వరకే 12 పెళ్లిళ్లు అయినట్లు గుర్తించారు. బెయిల్ కోసం ఆ మహిళ బుద్గామ్ కోర్టును ఆశ్రయించింది. ఈ విషయం తెలిసిన మిగిలిన భర్తలు పోలీస్ స్టేషన్‌కు (Police station ) చేరుకున్నారు. షాహీన్ అక్తర్‌తో తమకు జరిగిన పెళ్లి ఫోటోలను పోలీసులకు చూపించారు. ఈ నేపథ్యంలో ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు మిగిలిన విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు.