»Seema Hydari Who Came Illegally From Pakistan Married Sachin An Indian They Are Currently Missing
Seema and Sachin: పాక్ నుంచి అక్రమంగా వచ్చి భారతీయుడిని పెళ్లి చేసుకున్న యువతి మిస్సింగ్
పబ్జీ గేమ్ పరిచయం ప్రేమగా మారి తరువాత పెళ్లి చేసుకున్న పాకిస్తాన్ మహిళా సీమా గులాం హైదర్, భారతీయ యువకుడు సచిన్ గత 4 రోజులుగా కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. దీంతో యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్వార్ట్ అలర్ట్ అయింది.
Seema Hydari, who came illegally from Pakistan, married Sachin, an Indian. They are currently missing.
Seema and Sachin: పబ్జీ(PUBG) మొబైల్ గేమ్ తో పరిచయం ప్రేమగా మారి భారతీయ ప్రియుడి కోసం పాకిస్తాన్(Pakistan) నుంచి వచ్చిన సీమా గులాం హైదర్(Seema Gulam Hyderi) గత రెండు రోజులుగా కనిపించడం లేదట. తనతో పాటు భర్త సచిన్(Sachin), తన పిల్లలు కూడా కనిపించడం లేదట. దీంతో ఉత్తరప్రదేశ్ యాంటీ-టెర్రరిస్ట్ స్వార్డ్ (ఏటీఎస్) అలర్ట్ అయింది. ఇక వెంటనే ఆమె భారత్‌లోకి ప్రవేశించిన మార్గంతో పాటు, ఉగ్రవాద సంఘాలతో ఆమెకు ఉన్న సంబంధాలపై దర్యాప్తు ప్రారంభించింది.
నిజానికి ఆమె ఇండియాలో ప్రవేశించగానే ఆమెతో సహా ప్రియుడు సచిన్, అతడి తండ్రి నేత్రపాల్ ను విదేశీయులు చట్టం కింద యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. తరువాత వీరు బెయిల్ పై విడుదలయ్యారు. గత వారం రోజుల నుంచి గ్రేటర్ నోయిడాలో వీరు ఉంటున్న ఇంటి చుట్టూ స్థానిక పోలీసులు కాపలాగా ఉన్నారు. గత 4-5 రోజులుగా ఈ జంటను చూడలేదని గ్రామంలోని పొరుగువారు, ఇతరులు చెబుతున్నారు. భారతదేశంలోకి హైదర్ ప్రవేశానికి సంబంధించిన వివరాలపై ఏటీఎస్ దర్యాప్తు చేపట్టింది. సీమా, ఆమె నలుగురు పిల్లల పాస్‌పోర్టులు సహా ఆమె ఉపయోగించిన మొబైల్ ఫోన్లను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు.
పబ్జీ ద్వారా పరిచయం వీరిద్దరు ఖాట్మండులో కలుసుకొని అక్కడే పశుపతినాథ్ ఆలయంలో వివాహం చేసుకున్నారట. పాకిస్తాన్ పరిస్థితులు తీవ్ర గందరగోళంగా ఉన్నప్పటికీ, సీమా తన నలుగురు పిల్లలతో కలిసి కరాచీ నుండి ఖాట్మండు చేరుకోగలిగింది. అనంతరం నేపాల్ రాజధానిలో సచిన్‌ను కలుసుకుంది. సీమా పిల్లలను కూడా సచిన్ అంగీకరించాడు. ప్రస్తుతం వీరు కనిపించకపోవడంపై విచారణ జరుగుతోంది.