బేబీ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇద్దరు అబ్బాయిలు ఓ అమ్మాయిని ప్రేమిస్తే జరిగే పరిణామాలను ట్రైలర్లో చూపించారు. జులై 14న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.
రౌడీ హీరో విజయదేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం బేబి. ఈ మూవీలో విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ మారుతీ, నిర్మాత SKN కలిసి మాస్ మూవీ మేకర్స్ పతాకం పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 2020లో వచ్చిన కలర్ ఫోటో సినిమాకి కథని అందించిన సాయి రాజేష్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
‘బేబీ’ మూవీ ట్రైలర్ :
బేబీ మూవీ నుంచి ఇది వరకే సాంగ్స్, టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కథ మొత్తం హీరోయిన్ వైష్ణవి చైతన్య చుట్టూ తిరుగుతుంది. స్కూల్ లో ఒక అబ్బాయిని ప్రేమించిన హీరోయిన్ ఆ తర్వాత మరొకరితో ప్రేమలో పడుతుంది. ఇద్దరు అబ్బాయిలు ఆ అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమిస్తారు. నిజజీవితంలో జరుగుతున్న కథల ఆధారంగానే దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ అందర్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. “ప్రతి కష్టానికి ముందు దేవుడు ఏదొక సిగ్నల్ ఇస్తాడు. మరి నీలాంటి అమ్మాయి జీవితంలోకి వచ్చే ముందు అసలు సిగ్నల్ ఎందుకు ఇవ్వడే”, “తిరిగి కొట్టేంత బలం లేదనేగారా మీకు ఈ కొవ్వు. మీ అంత బలం లేకపోవచ్చు. కానీ గుండెల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా ఇంకెవరు కొట్టలేరు” అనే డైలాగ్స్ ట్రైలర్’కు హైలెట్ గా నిలిచాయి. జులై 14న ఈ మూవీ విడుదల కానుంది.