»Bars And Restaurants Are Open 24 Hours In The Haryana
Open 24 hours: 24 గంటలు బార్ అండ్ రెస్టారెంట్లు ఓపెన్
బీజేపీ పాలిత హర్యానా రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు. గతంలో కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఆఫీసులోనే బీర్, వైన్ సేవించేందుకు అనుమతులు ఇవ్వగా.. ఇప్పుడు తగిన ఫీజు చెల్లించి 24 గంటలు బార్ అండ్ రెస్టారెంట్లు ఓపెన్ చేసుకునేందుకు హర్యానా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
రాష్ట్రంలో 24 గంటలు రెస్టారెంట్లు, బార్లు తెరిచి ఉంటాయని హర్యానా(haryana) ప్రభుత్వం స్పష్టం చేసింది. రాత్రి పూట వాటిని మూసేయాలన్న ఒత్తిడి ఉండదని ఈ మేరకు వెల్లడించారు. సీఎం అధ్యక్షతన జరిగిన వివిధ శాఖల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్ యూనియన్ల ఆఫీస్ బేరర్లతో సమావేశమై 24 గంటల పాటు రెస్టారెంట్లు తెరిచి ఉంచడానికి అనుమతిని కోరిన నేపథ్యంలో అనుమతి లభించింది. రాష్ట్రంలోని రెస్టారెంట్ల యజమానులు తమ సంస్థలను 24 గంటలు తెరిచి ఉంచాలని దుష్యంత్ చౌతాలా అధికారులను ఆదేశించారు. కానీ పలు నియమాలు పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు ఎవరైనా రెస్టారెంట్ యజమాని తమను అనవసరంగా వేధిస్తున్నారని భావిస్తే, వారు తమ ఫిర్యాదును MSME ID [email protected]కి మెయిల్ చేయవచ్చని డిప్యూటీ సీఎం చెప్పారు.
దీంతో ఉత్తర భారతదేశంలో రెస్టారెంట్లు, తినుబండారాలు, బార్లు 24×7 పనిచేయడానికి అనుమతించిన ఏకైక రాష్ట్రంగా హర్యానా అవతరించింది. హర్యానా ప్రభుత్వం రాష్ట్రంలో రెస్టారెంట్లు 24×7 పనిచేయడానికి అనుమతించడం పట్ల సంతోషిస్తున్నట్లు కార్పొరేట్ ఉద్యోగులు పేర్కొన్నారు. తమ కార్యాలయాలు అంతర్జాతీయ సమయాల ప్రకారం రోజంతా పనిచేస్తాయని, పలు షిఫ్ట్‌లు ఉన్న ఉద్యోగులకు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూరుస్తుందని వెల్లడించారు. ఇక నుంచి వారు రాత్రిపూట రెస్టారెంట్లలో భోజనం చేయగలుగుతారని ఆనందం వ్యక్తం చేశారు. రెస్టారెంట్లు, తినుబండారాలు, బార్ల ద్వారా అర్థరాత్రి, తెల్లవారుజామున కూడా కస్టమర్లు వేడి వేడి, రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చన్నారు.