నటి సమంత(Samantha) సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి యాక్ట్ చేస్తున్న రొమాంటిక్ డ్రామా ఖుషి మూవీ చివరి షెడ్యూల్ మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. ఆ తర్వాత సామ్ తన ఆరోగ్యంపై దృష్టి సారించనున్నట్లు సమాచారం.
స్టార్ హీరోయిన్ సమంత(Samantha)సినిమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఒక సంవత్సరం పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. తాజా అప్డేట్ ప్రకారం సిటాడెల్ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి కాగా…ఖుషి(kushi) మూవీ షూట్ మరో రెండు రోజుల్లో పూర్తైన తర్వాత సమంతా సినిమాల నుంచి ఏడాది పాటు విరామం తీసుకోనుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే సామ్ తెలుగు, తమిళం లేదా బాలీవుడ్లో ఎలాంటి కొత్త ప్రాజెక్ట్‌లకు సైన్ చేయడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ఆమె తన ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి, మైయోసైటిస్ వ్యాధి అదనపు చికిత్సను పొందేందుకు విరామాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సమంత తన భవిష్యత్ ప్రాజెక్ట్‌ల నిర్మాతలకు ఇంతకు ముందు అందుకున్న అడ్వాన్స్ చెల్లింపులను కూడా తిరిగి ఇచ్చినట్లు తెలిసింది.
ఇక సమంతా యాక్ట్ చేసిన అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ సిటాడెల్(citadel) భారతీయ వెర్షన్ డిజిటల్ ప్రీమియర్ త్వరలో ప్రదర్శించబడుతుంది. ఇందులో ఆమె హిందీ నటుడు వరుణ్ ధావన్‌తో కలిసి నటించింది. ఇది దాదాపు పూర్తయింది. ఈ నేపథ్యంలో సమంత తన ప్రస్తుత కమిట్మెంట్లను ముగించే పనిలో బిజీగా ఉందని, తన నిర్ణయాన్ని ఇప్పటికే నిర్మాతలకు తెలియజేసిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 2022 చివరిలో సమంత తనకు మైయోసిటిస్(myositis) అనే ఆటో ఇమ్యూన్ కండిషన్‌తో బాధపడుతున్నట్లు, దాని కోసం చికిత్స పొందుతున్నట్లు అప్పట్లో వెల్లడించింది.