హాట్ బ్యూటీ రష్మిక మందన ఎప్పటికప్పుడు ఏదో విషయంలో వివాదానికి తెరలేపుతునే ఉంది. నిన్న, మొన్నటి వరకు సొంత కన్నడ ఇండస్ట్రీ అమ్మడిపై విరుచుకు పడింది. కాంతార సినిమా చూడలేదని చెప్పడం.. కనీసం తనకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన ప్రొడక్షన్ పేరు కూడా చెప్పకపోవడం.. రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టిలను తక్కువ చేయడం.. లాంటివి చేసింది. దీంతో కన్నడలో రష్మికను బ్యాన్ చేసే వరకు వెళ్లింది వ్యవహారం. అయితే ఇంటర్నల్‌గా ఏం జరుగుతోంతో మీకు తెలియదని.. ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు ఏకంగా సౌత్ ఇండస్ట్రీ పైనే కొన్ని సంచలన కామెంట్స్ చేసింది. సౌత్ సినిమాల్లో నటిస్తు.. పాన్ ఇండియా బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ప్రస్తుతం బాలీవుడ్ మొత్తం సౌత్ సినిమాల వైపు చూస్తుంటే.. సౌత్ హీరోయిన్లు మాత్రం బాలీవుడ్ అంటేనే ఓ మైకంలో తేలిపోతున్నారు. ఇప్పటికే ఆ జాబితాలో రష్మిక కూడా చేరిపోయింది. బాలీవుడ్ పై మోజుతోనే లేక.. సౌత్ సినిమాలను తక్కువగా చూస్తుందో ఏమో గానీ.. ఇప్పుడు సౌత్ సాంగ్స్ కంటే బాలీవుడ్ సాంగ్స్ బెటర్ అనే కామెంట్స్ చేసింది. బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ ‘గుడ్ బై’ అమ్మడికి ఝలక్ ఇచ్చినా.. మరోసారి ‘మిషన్ మజ్ను’ అనే సినిమాతో లక్ చెక్ చేసుకోబోతోంది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ సినిమా డైరెక్ట్‌గా నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతోంది. ఆ సినిమా ప్రమోషన్స్‌లో.. బాలీవుడ్ సినిమాల్లో రొమాంటిక్ లవ్ సాంగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి.. చిన్నప్పటి నుంచి హిందీ లవ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం.. కానీ సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా మాస్ మసాలా సాంగ్స్ ఉంటాయి.. అందుకే తన మొదటి రొమాంటిక్ సాంగ్ కోసం చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నానని చెప్పుకొచ్చింది. దాంతో ఇక్కడ స్టార్డమ్ తెచ్చుకొని.. ఇక్కడి సినిమాలు తక్కువ చేసి మాట్లడడం కరెక్ట్ కాదని.. ఆమెపై అసహనం వ్యక్తం అవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. రష్మికకు నోటి దూల అని.. లేదంటే బాలీవుడ్‌ను అట్రాక్ట్ చేయడం కోసం బిల్డప్ ఇస్తోందా.. అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా మరోసారి రష్మిక కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారింది.