పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నందమూరి నటసింహం బాలకృష్ణ.. అన్‌స్టాపబుల్ షో డిసెంబర్ 30న ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ షో కోసం ఒక్క తెలుగు ఆడియెన్స్ మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్ బాహుబలి సినిమాలాగే రెండు భాగాలుగా రాబోతోందట. ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్‌కు సంబంధించిన టీజర్ షో పై అంచనాలను పెంచేసింది. అలాంటిది ఇప్పుడు ప్రభాస్ ఎపిసోడ్ రెండు భాగాలుగా రానుందని తెలియడంతో.. అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. అసలు ఇప్పటి వరకు ‘అన్ స్టాపబుల్’ షోలో ఏ గెస్ట్‌కు కూడా రెండు ఎపిసోడ్లు రాలేదు. కానీ ఇప్పుడు ప్రభాస్‌కే ఈ గౌరవం దక్కనుందని అంటున్నారు. అయితే ప్రభాస్ ఎపిసోడ్‌కే ఎందుకలా అంటే.. ఈ ఎపిసోడ్ నిడివి చాలా సేపు వచ్చిందట. ఆహా టీమ్‌కు ఇందులో ఏది కూడా ఎడిటింగ్‌లో లేపేయడానికి మనసు ఒప్పడం లేదట. అందుకే ఏ మాత్రం ఎడిట్ చేయకుండా ప్రభాస్ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా ప్రసారం చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే డిసెంబర్ 30న వరకు ఆగాల్సి ఉంది. ఒకవేళ నిజంగానే ప్రభాస్, బాలయ్య.. అన్‌స్టాపబుల్ షో రెండో ఎపిసోడ్ ఉంటే మాత్రం.. ఫస్ట్ ఎపిసోడ్లో ఎలాంటి లీడ్ ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అలాగే ప్రభాస్, బాలయ్య ఎంత సందడి చేసి ఉంటారనేది మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. మొత్తంగా ప్రభాస్-బాలయ్య ఎపిసోడ్ సెన్సేషనల్‌గా నిలిచేలానే ఉంది.