Nifty: స్టాక్ మార్కెట్ (Stock market) ఈ రోజు పరుగులు తీసింది. సెన్సెక్స్ (sensex) సూచీ 64 వేల పాయింట్లను దాటగా.. నిఫ్టీ (nifty) 19 వేల పాయింట్లను క్రాస్ అయ్యింది. నిఫ్టీ-50లోని అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫైనాన్స్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. 21ఇఎంఏ నుంచి వచ్చిన మద్దతుతో నిప్టీ దూసుకెళ్లింది.
రెండు వారాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లో బలమైన కాల్ ఆప్షన్ రైటింగ్ కనిపించింది. సెన్సెక్స్ (sensex) ఇలానే కొనసాగితే దీపావళి నాటికి 70 వేల మార్క్ చేరడం ఖాయం అని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అదుపులోకి వస్తోన్న ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గుదల, స్థిరమైన విదేశీ ప్రవాహాల వల్ల సెన్సెక్స్ (sensex) రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతోందట. ఫార్మా (pharma), ఆటో (auto), బ్యాంకింగ్ (banking) రంగాల్లో ఇదే రోజు కొనసాగుతాయని నిపుణులు చెబుతున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ లాభాలను నమోదు చేశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 499 పాయింట్లు లాభపడి 63,915కి ఎగబాకింది. నిఫ్టీ 155 పాయింట్లు పుంజుకుని 18,972కి చేరుకుంది. విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లలో భారీగా పెట్టుబడులు పెడుతుండటంతో సూచీలు పరుగులు తీశాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు గరిష్ఠ స్థాయికి చేరుకోవడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపుతోంది.