PLD: చిలకలూరిపేట కొమ్మినేని ఆసుపత్రి డాక్టర్ వీరశంకర రావుకు టైమ్స్ ఆఫ్ ఇండియా గౌరవ పురస్కారం దక్కింది. నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు మంగళవారం ఆయన్ను ఘనంగా సత్కరించారు. గ్రామీణ ప్రాంతంలో మెరుగైన వైద్యం అందిస్తున్నందుకు ఈ గుర్తింపు వచ్చిందన్నారు. ఇది పల్నాడుకు గర్వకారణమని కొనియాడారు. ప్రజల ఆశీర్వాదంతోనే ఇది సాధ్యమైందని డాక్టర్ తెలిపారు.