PLD: చేబ్రోలు మండలానికి చెందిన వివిధ అనారోగ్యాలతో బాధపడుతున్న ఐదుగురు అర్జిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 3,05,513 విలువైన చెక్కులను పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అందజేశారు. ప్రభుత్వ సహకారంతో లబ్ధిదారులు సకాలంలో వైద్య చికిత్సలు పొందగలుగుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.