ATP: శింగనమల నియోజకవర్గ వైసీపీ పరిశీలకుల సమావేశం ఇవాళ ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, నియోజకవర్గ ఇంఛార్జ్ సాకే శైలజానాథ్ పాల్గొని, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యలపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.