అన్నమయ్య: రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రూ. 23 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ పనులను రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆర్డీవో శ్రీనివాసులతో కలిసి పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ను మంత్రి ఆదేశించారు.