ATP: విధి నిర్వహణలో రెవెన్యూ, సర్వే ఉద్యోగులు ఎన్నో ఒత్తిళ్లకు గురవుతున్నారని అలాంటి వారికోసం ఆరోగ్య సంరక్షణ ప్రధానమని భావించి, ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఇంఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ ప్రారంభంలో ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు.