ATP: నిరుపేదలకు విద్య, వైద్యం అందించే లక్ష్యంతో కళ్యాణదుర్గంలో ‘ఆరా ఇగ్నైట్స్’ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటైంది. ఈ సంస్థ లోగోను జిల్లా ఎస్పీ జగదీష్ కుమార్ ఆవిష్కరించారు. యూనియన్ బ్యాంక్ ఉద్యోగి లోకేష్ నెలకొల్పిన ఈ ట్రస్ట్ సేవలను ఎస్పీ అభినందించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు, నిరుపేద రోగులకు అండగా నిలవడమే తమ ప్రధాన ఉద్దేశమని చైర్మన్ లోకేష్ తెలిపారు.