PPM: ప్రజలంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగదీశ్వరి కోరారు. మంగళవారం మొండెంఖల్లులో వైద్య శిబిరాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే ఆరోగ్య పరీక్షలను చేయించుకున్నారు. ప్రజలంతా తమ ఆరోగ్య పరీక్షలను ఈ శిబిరాలకు వచ్చి చేయించుకోవాలని సూచించారు.