KDP: కమలాపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణ చైతన్య రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆలయ ఛైర్మన్ కామిశెట్టి వెంకటరమణయ్య, కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకున్నారు.