రంగారెడ్డి జిల్లా పశుగణాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో కేశంపేట మండలం సంగెం గ్రామంలో పశువులకు ఉచిత పశుగర్భకోశ వ్యాధి చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వేణుగోపాల చారి మాట్లాడుతూ.. పశువుల్లో ఎక్కువగా కనిపిస్తున్న గర్భకోష సంబంధిత వ్యాధులను గుర్తించి తొలి దశలోనే చికిత్స అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు.